ePaper
More
    HomeతెలంగాణTiranga Rally | 19న తిరంగా ర్యాలీని విజయవంతం చేయాలి

    Tiranga Rally | 19న తిరంగా ర్యాలీని విజయవంతం చేయాలి

    Published on

    అక్షరటుడే, ఇందూరు: Tiranga Rally | నగరంలో 19న నిర్వహించనున్న తిరంగా ర్యాలీని (Tiranga Rally) విజయవంతం చేయాలని అర్బన్​ ఎమ్మెల్యే ధన్​పాల్​ సూర్యనారాయణ (Urban MLA Dhanpal Suryanarayana) అన్నారు. శనివారం ఎమ్మెల్యే క్యాంప్​ కార్యాలయంలో (MLA Camp Office) విలేకరులతో మాట్లాడారు. పాకిస్తాన్ (Pakistan)​లో ఉగ్రవాదులు మరణిస్తే అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించడం ప్రపంచమంతా చూసిందన్నారు. భారతదేశం శాంతిని కోరుకుంటుంది కాబట్టే ‘ఆపరేషన్​ సింధూర్​’ను తాత్కాలికంగా నిలిపేసిందన్నారు.

    ఆపరేషన్ సింధూర్ (Operation Sindoor) విజయవంతమైనందుకు సైనికులకు కృతజ్ఞతాభావంగా ఈనెల 19న జిల్లా కేంద్రంలో భారీ తిరంగా ర్యాలీ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. రాజకీయ పార్టీలకతీతంగా ర్యాలీలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. పాకిస్తాన్​లో తొమ్మిది ఉగ్రవాద స్థావరాలు నేలమట్టం చేయడంతో భారత సైనిక శక్తి ఎలాంటిదో ప్రపంచానికి చాటామన్నారు. ఎస్–400 (S-400) సుదర్శన చక్రంలా భారతదేశాన్ని కాపాడిందని కొనియాడారు. సమావేశంలో తిరంగా ర్యాలీ కన్వీనర్ కృపాకర్ రెడ్డి (Tiranga Rally Convener Krupakar Reddy), శంకర్, వెంకట రమణ, మాస్టర్ శంకర్ తదితరులు పాల్గొన్నారు.

    More like this

    Bodhan | బోధన్​లో ‘ఉగ్ర’​ లింకుల కలకలం

    అక్షరటుడే, బోధన్​ : Bodhan | నిజామాబాద్​ జిల్లా బోధన్​లో ఉగ్రవాద లింకులు కలకలం సృష్టించాయి. కేంద్ర దర్యాప్తు...

    Supreme Court | నేపాల్, బంగ్లాదేశ్ అల్లర్లను ప్రస్తావించిన సుప్రీంకోర్టు.. మన రాజ్యాంగాన్ని చూసి గర్విస్తున్నామన్న సీజేఐ గవాయ్

    అక్షరటుడే, వెబ్ డెస్క్: Supreme Court | భారతదేశ రాజ్యాంగం అత్యంత గొప్పదని, దాన్ని పట్ల ఎంతో గర్వంగా...

    Kamareddy SP | విధుల్లో నిర్లక్ష్యం.. ఎస్సైపై సస్పెన్షన్​ వేటు

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy SP | విధుల్లో నిర్లక్ష్యం వహించిన పోలీసులపై ఎస్పీ రాజేష్​ చంద్ర కొరడా ఝులిపించారు....