అక్షరటుడే,ఎల్లారెడ్డి: Telangana Jagruthi | తెలంగాణ జాగృతి యువజన సమాఖ్య రాష్ట్ర కన్వీనర్‌గా లింగంపేట్‌కు చెందిన ఎదురుగట్ల సంపత్ గౌడ్ నియమితులయ్యారు. ఈ మేరకు జాగృతి అధ్యక్షురాలు కవిత (Jagruthi President Kavitha) ఈ నియామకాన్ని ధృవీకరించారు. ఈ సందర్భంగా సంపత్‌గౌడ్ మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో ఇచ్చిన పదవికి న్యాయం చేస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. ఆయన గతంలో సింగిల్ విండో ఛైర్మన్, డీసీసీబీ డైరెక్టర్‌గా, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌గా, జిల్లా గౌడ సంఘం అధ్యక్షుడిగా, గౌడ వసతిగృహం డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు.
అలాగే జాగృతి మహిళా సమాఖ్య (Jagruti Women’s Federation) రాష్ట్ర కన్వీనర్‌గా మరిపెల్లి మాధవి, లీగల్ సెల్ రాష్ట్ర కన్వీనర్‌గా అప్పాల నరేందర్ యాదవ్, విద్యార్థి సమాఖ్య రాష్ట్ర కన్వీనర్ జనపాటి రాము యాదవ్, యువజన సమాఖ్య హైదరాబాద్ కన్వీనర్‌గా పరకాల మనోజ్ గౌడ్‌ను నియమించారు.