CIBIL score | సిబిల్ స్కోర్ వారికి తప్పనిసరి కాదు : కేంద్రం
CIBIL score | సిబిల్ స్కోర్ వారికి తప్పనిసరి కాదు : కేంద్రం

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Cibil Score | రుణం తీసుకోవాల‌నుకుంటున్నారా? క్రెడిట్ కార్డు(Credit Card) పొందాల‌నుకుంటున్నారా? హౌసింగ్‌ లోన్ కావాలా? మీరు ఏదీ కావాల‌న్నా CIBIL లేదా క్రెడిట్ స్కోర్ చాలా కీలక పాత్ర పోషిస్తుంది. మంచి స్కోర్ ఉంటే మీకు త‌క్కువ వ‌డ్డీకే ఈజీగా రుణాలు ల‌భిస్తాయి. ఇంకా అనేక ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. ఒక‌వేళ సిబిల్ త‌క్కువ‌గా ఉంటే రుణం ఇవ్వ‌డానికి బ్యాంకులు, ప్రైవేట్ సంస్థ‌లు వెనుకాడతాయి. అధిక క్రెడిట్ స్కోర్ వ‌ల్ల ప్రీమియం క్రెడిట్ కార్డులు, ప్రత్యేకమైన బ్యాంకింగ్ ఉత్పత్తులు, కొన్ని సందర్భాల్లో మీకు ఉద్యోగం పొందడానికి కూడా సహాయపడుతుంది. అనేక కంపెనీలు, ముఖ్యంగా ఫైనాన్స్, సున్నితమైన డేటా-సంబంధిత రంగాలలో, నియామక ప్రక్రియ సమయంలో అభ్యర్థుల క్రెడిట్ స్కోర్‌లను తనిఖీ చేస్తాయి. ఈ త‌రుణంలో మంచి క్రెడిట్ స్కోర్‌(Credit Score)ను క‌లిగి ఉండ‌డం వ‌ల్ల కలిగే ప్రయోజనాలు తెలుసుకుందామా..

Cibil Score | వేగవంతమైన రుణ ఆమోదాలు

అధిక క్రెడిట్ స్కోర్‌ ఉన్న దరఖాస్తుదారులకు సులువుగా రుణాలు ల‌భిస్తాయి. ఇలాంటి వారికే లోన్లు ఇవ్వ‌డానికి ఫైనాన్స్ సంస్థ‌లు(Finance companies) ఎక్కువ‌గా ఆస‌క్తి చూపిస్తాయి. లోన్ మంజూరు కూడా వేగంగా పూర్త‌వుతుంది. రుణదాతలు వారిని తక్కువ-రిస్క్ రుణగ్రహీతలుగా చూస్తారు. ఇది త్వరిత ఆమోదాల అవకాశాలను, ముందస్తు ఆమోదం పొందిన రుణ ఆఫర్‌లకు కూడా అవ‌కాశం క‌ల్పిస్తుంది.

Cibil Score | తక్కువ వడ్డీ రేట్లు

మంచి సిబిల్ మెయింటేన్ చేస్తున్న వారికి త‌క్కువ వ‌డ్డీ రేట్ల‌కే రుణాలు ల‌భిస్తాయి. గృహ, వ్యక్తిగత రుణం లేదా వాహ‌న రుణాలైనా తక్కువ వడ్డీ రేట్లకు రుణాలను పొందవచ్చు. మీరు తక్కువ APRలతో క్రెడిట్ కార్డులను కూడా పొందవచ్చు. కాలక్రమేణా ఇది వడ్డీ చెల్లింపులపై గణనీయమైన పొదుపుకు దారితీస్తుంది.

Cibil Score | బేర‌సారాల స్థితిని పెంచుతుంది..

దృఢమైన క్రెడిట్ స్కోరు(Credit Score) మీ బేరసారాల స్థితిని బలపరుస్తుంది. తక్కువ వడ్డీ రేట్లు లేదా మరింత సరళమైన తిరిగి చెల్లింపు షెడ్యూల్‌ వంటి అనుకూలమైన రుణ నిబంధనలను నిగోషియేట్ చేయ‌డానికి మీకు మంచి అవ‌కాశం క‌లుగుతుంది.

Cibil Score | బీమా ప్రీమియంలు

కొన్ని బీమా కంపెనీలు ప్రీమియం మొత్తాలను నిర్ణయించేటప్పుడు క్రెడిట్ స్కోర్‌లను పరిగణనలోకి తీసుకుంటాయి. అధిక క్రెడిట్ స్కోరు మీ బీమా ప్రీమియం(Insurance premium) ఖర్చును తగ్గించే అవకాశం ఉంది.

Cibil Score | అధిక క్రెడిట్ పరిమితులు

బ్యాంకులు(Banks) అధిక క్రెడిట్ స్కోర్‌ ఉన్న వ్యక్తులను ఆర్థికంగా బాధ్యతాయుతంగా చూస్తాయి. తద్వారా వారు అధిక రుణ మొత్తాలు, క్రెడిట్ పరిమితులను ఆమోదించే అవకాశం ఉంది. అంటే మీరు ఎక్కువ రుణం తీసుకోవడమే కాకుండా సులభమైన నిబంధనలు మరియు వేగవంతమైన ప్రాసెసింగ్‌ను కూడా ఆస్వాదించవచ్చు.