ePaper
More
    HomeజాతీయంThe Resistance Front | ‘370’ రద్దుకు వ్యతిరేకంగా పుట్టిన సంస్థ టీఆర్ఎఫ్

    The Resistance Front | ‘370’ రద్దుకు వ్యతిరేకంగా పుట్టిన సంస్థ టీఆర్ఎఫ్

    Published on

    The Resistance Front : జమ్మూకాశ్మీర్​లో జరిగిన ఉగ్రదాడికి పాల్పడిన ‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్’ (టీఆర్ఎఫ్) తొలుత ఆన్​లైన్​ వేదికగా పురుడు పోసుకుంది. అది ప్రారంభమైన ఆర్నెళ్లలోనే ఆఫ్​లైన్​ సంస్థగా ఆవిర్భవించింది. ఆగస్టు 5, 2019న నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆర్టికల్ 370 ని రద్దు చేసిన తర్వాత రెసిస్టెన్స్ ఫ్రంట్ ఉద్భవించింది. ప్రారంభంలో ఆన్​లైన్​ ఫోరమ్ అయిన ఈ ఉగ్రవాద సంస్థ ఆరు నెలల్లోపు ఆఫ్​లైన్​ సంస్థగా మారింది. తాజాగా జమ్మూలో కాల్పులకు తెగబడి 27 మందిని పొట్టనబెట్టుకుంది.

    The Resistance Front : లష్కరేకు అనుబంధంగా..

    లష్కరే తోయిబా అనుబంధ సంస్థ అయిన ఏర్పాటైన రెసిస్టెన్స్ ఫ్రంట్ స్వల్ప కాలంలోనే వేగంగా విస్తరించింది. పాకిస్తాన్ లోని ఉగ్ర సంస్థలతో సంబంధాలు పెట్టుకున్న టీఆర్ఎఫ్.. ఇప్పుడు కాశ్మీర్​లో కార్యకలాపాలు సాగించే స్థాయికి ఎదిగింది. లష్కరే, ఇతర ఉగ్రవాద గ్రూపుల నుంచి నియామకాలు జరుపుకొంటూ ఈ బృందం అనేక దాడులకు బాధ్యత వహిస్తోంది. దాని వ్యవస్థాపకుడు షేక్ సజ్జాద్ గుల్ లేదా షేక్ సజ్జాద్. పాకిస్తాన్, హఫీజ్ సయీద్​కు సంబంధం లేకుండా స్వతంత్రంగా పని చేస్తుందని చెబుతున్నారు. కాశ్మీర్​లో “స్థానిక అణచివేతకు” వ్యతిరేకమని పేర్కొన్నారు.

    The Resistance Front : సజ్జాద్​ను ఉగ్రవాదిగా ప్రకటించిన కేంద్రం

    అక్టోబర్ 10, 1974న శ్రీనగర్​లో జన్మించిన ది రెసిస్టెన్స్ ఫ్రంట్ వ్యవస్థాపకుడు షేక్ సజ్జాద్​కు కేంద్ర ప్రభుత్వం 2022లో ఉగ్రవాదిగా ప్రకటించింది. 2022 డేటా ప్రకారం.. జమ్మూ, కాశ్మీర్​లో భద్రతాదళాలు జరిపిన కాల్పుల్లో మృతి చెందిన 172 మంది ఉగ్రవాదులలో 108 మంది ది రెసిస్టెన్స్ ఫ్రంట్​కు చెందిన వారేనని తేలింది. అయినప్పటికీ ఆ సంస్థ 74 మంది నియమించుకున్నట్లు గుర్తించారు.

    Latest articles

    Inter student | కొత్త చీర కొనివ్వలేదని.. చీరతోనే ఉరేసుకున్న ఇంటర్ విద్యార్థిని!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Inter student : నేటి తల్లిదండ్రులు ఎన్నో కష్టాలు ఎదుర్కొంటూ అతి కష్టం మీద తమ...

    Dial 100 | మద్యం మత్తులో డయల్​ 100కు కాల్​.. కఠినంగా స్పందించిన పోలీసులు.. నాలుగు రోజుల జైలు శిక్ష

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Dial 100 : డయల్​ 100 అంటే.. అత్యవసర పరిస్థితులలో పోలీసులను సంప్రదించేందుకు ఉపయోగించే హెల్ప్‌లైన్...

    US tariffs | అన్యాయం.. అసమంజసం.. అమెరికా సుంకాలను తీవ్రంగా ఖండించిన భారత్

    అక్షరటుడే, న్యూఢిల్లీ: US tariffs : అమెరికా అదనపు సుంకాలు పెంచడాన్ని ఇండియా India తీవ్రంగా ఖండించింది. భారత...

    Helmet | హెల్మెట్​ బదులు పాల క్యాన్​ మూత.. పెట్రోల్​ బంకు​ సీజ్​..!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Helmet : మధ్యప్రదేశ్​(Madhya Pradesh)లోని ఇండౌర్​(Indore)లో తాజాగా కఠినమైన ట్రాఫిక్ ఆంక్షలు అమలులోకి తీసుకొచ్చారు. ద్విచక్ర...

    More like this