అక్షరటుడే, వెబ్డెస్క్:Pak Spy | పాక్ గూఢచారిని అధికారులు అరెస్ట్ చేశారు. భారత రహస్యాలను పాకిస్తాన్(Pakistan)కు చేరవేస్తున్నట్లు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. హర్యానాకు చెందిన దేవేంద్ర సింగ్ 2024లో కర్తార్‌పూర్ కారిడార్ ద్వారా పాకిస్తాన్ వెళ్లాడు. అక్కడ పాకిస్తానీ నిఘా అధికారిని ఆయన కలిశాడు.హనీట్రాప్ ద్వారా దేవేంద్ర సింగ్‌ను పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ(Pakistan intelligence agency ISI) తమ గుప్పిట్లో పెట్టుకుంది. అనంతరం భారత సైనిక స్థావరాల వివరాలను ఆయన ద్వారా తెలుసుకుంది. దేవేంద్రసింగ్ భారత సైనిక స్థావరాల వివరాలను పాక్‌కు అందించినట్లు గుర్తించారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకు ఖాతాలను పరిశీలిస్తున్నారు.
Pak Spy | గూఢచారులపై నిఘా
పహల్గామ్ ఉగ్రదాడి(Pahalgam Terror Attack) తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరిన విషయం తెలిసిందే. ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సిందూర్(Operation Sindoor) చేపట్టి పీవోకే, పాకిస్తాన్లోని తొమ్మిది ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసింది. ఈ ఆపరేషన్లో 100 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. అనంతరం భారత్ పాక్ మధ్య దాడులు, ప్రతిదాడులు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో భారత అధికారులు అప్రమత్తం అయ్యారు. దేశంలో ఉంటూ పాక్‌కు సమాచారం అందిస్తున్న వారిపై నిఘా పెట్టారు. పాక్‌కు భారత రహస్యాలను చేరవేస్తున్న పలువురిని అరెస్ట్ చేస్తున్నారు. ఇటీవల అమృత్సర్లో ఇద్దరు అనుమానితులను అరెస్ట్ చేశారు. జై సల్మేర్(Jai Salmer)లో మరో గూఢచారిని అరెస్ట్ చేశారు. హర్యానాలో రెండు రోజుల క్రితం ఇద్దరిని, తాజాగా దేవేంద్రసింగ్ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.