Samantha
Samantha | రాజ్‌తో స‌మంత సంతోషంగా ఉండాలి.. శ‌త‌మానం భ‌వ‌తి అని దీవించిన సీనియ‌ర్ న‌టి

అక్షరటుడే, వెబ్​డెస్క్: Samantha | గ‌త కొద్ది రోజులుగా ఎక్క‌డ చూసిన రాజ్- స‌మంతల Samantha రిలేష‌న్ గురించే చ‌ర్చ న‌డుస్తుంది. నాగచైతన్యతో విడాకుల తర్వాత ఒంటరిగా ఉంటున్న సమంత ఈ బాలీవుడ్ డైరెక్టర్‌తో పీకల్లోతు ప్రేమలో ఉందంటూ అనేక ఊహ‌గానాలు వ‌చ్చాయి. ఇక‌ రెండ్రోజుల క్రితం రాజ్‌తో సమంత క్లోజ్‌గా ఉన్న ఫోటోలు వైరల్ కావడంతో వీరిద్దరి మధ్య నిజంగానే ఏదో జరుగుతోందనే గాసిప్స్‌కు మరింత బలం చేకూర్చినట్లయ్యింది. రాజ్ స‌మంత(Raj Samantha) క్లోజ్‌గా ఉన్న‌ ఫొటో వైరల్‌గా మారిన తరుణంలో రాజ్‌ సతీమణి శ్యామాలి తాజాగా ఇన్‌స్టా వేదికగా ఒక పోస్ట్‌ పెట్టారు. ‘‘నా గురించి ఆలోచించి, విని, మాట్లాడేవారితోపాటు నన్ను కలిసి, నాతో మాట్లాడి, నా గురించి రాసిన వారందరికీ ప్రేమ, ఆశీస్సులు అందిస్తున్నా’’ అని పోస్ట్‌ను ఆమె షేర్‌ చేశారు.

Samantha | అంతా స‌స్పెన్స్..

ప్రస్తుతం ఆమె పోస్ట్‌ నెట్టింట వైరల్‌గా మారింది. కొంతకాలంగా ఇన్‌స్టా(Insta)లో ఎలాంటి పోస్ట్‌ షేర్‌ చేయని ఆమె ఉన్నట్టుండి ఇలాంటి సందేశం ఎందుకు షేర్‌ చేశారా? అని చర్చ జరుగుతోంది. వారిద్ద‌రి రిలేష‌న్ గురించి రాజ్ భార్య ఇలాంటి హింట్ ఇచ్చింద‌ని అంటున్నారు. క‌ట్ చేస్తే సీనియర్ నటి మధుమణి Madhumani శుభం ఈవెంట్‌లో ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేశారు. నేను 39ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నాను ఎంతో మంది హీరో హీరోయిన్స్ కు తల్లిగా నటించాను.. 3 నంది అవార్డులు, 2 ఫిలింఫేర్‌ అవార్డులు తీసుకున్నా.. దాదాపు 400 సినిమాలు చేశాను. అయితే సమంతతో కలిసి నటించే ఛాన్స్ మాత్రం దక్క‌లేదు. రంగస్థలం సినిమాలో అవకాశం వచ్చినా అది మిస్ అయ్యింది.

ఇన్నాళ్లకు ఆమె సినిమాలో నటించే ఛాన్స్ వచ్చింది అని అన్నారు. అలాగే శుభం సినిమాలో ఛాన్స్ రాగానే హ్యాపీగా ఫీల్ అయ్యా.. ఒక్క రోజు షూటింగ్ చేయగానే చికెన్ గున్యా వచ్చింది.. ఛాన్స్ మిస్ అవుతుందేమో అని భయపడ్డా కానీ అదృష్టంకొద్దీ నాలుగు నెలల తర్వాత మళ్లీ ‘శుభం’తో ప్రయాణం మొదలు పెట్టాను. సమంత అందరిని ఎంతో బాగా చూసుకున్నారు. నాకు ఈ అవకాశం ఇచ్చిన సామ్​కు శుభం(Subham). రాజ్‌, సమంత శుభంతో ఈ జర్నీ మొదలు పెట్టారు. శుభంగానే ఇలాగే ఎల్లవేళలా సంతోషంగా ఉండాలి. శతమానం భవతి అంటూ ఆశీర్వదించారు. దాంతో సమంత, రాజ్‌ల రిలేషన్​ను మదుమణి దాదాపు కన్ఫర్మ్ చేశారు అంటూ నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. అయితే వీరి రిలేష‌న్‌పై స‌మంత మేనేజ‌ర్ స్పందిస్తూ వారిద్ద‌రి మ‌ధ్య రిలేష‌న్ ఉంద‌ని వ‌స్తున్న వార్త‌లు అవాస్తం అని కామెంట్ చేశారు.