IPL 2025
IPL 2025 | నేటి నుండి ఐపీఎల్ రీస్టార్ట్.. స్క్వాడ్స్‌లో ఊహించ‌ని మార్పులు

అక్షరటుడే, వెబ్​డెస్క్ : IPL 2025 | భారత్ – పాక్(India – Pakistan) ఉద్రిక్తతలతో వాయిదా పడిన ఐపీఎల్ 2025 IPL 2025ఈ రోజు నుంచి తిరిగి ప్రారంభం కాబోతుంది. ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సెల్ విడుదల చేసిన నూతన షెడ్యూల్ ప్రకారం మే 17 నుంచి జూన్ 3 వరకు ఐపీఎల్ 2025 జరుగుతుంది. పంజాబ్ కింగ్స్(Punjab Kings) – ఢిల్లీ క్యాపిటల్స్‌(Delhi Capitals)తో ఆగిన ఈ సీజన్‌ను.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(Royal Challengers Bangalore) – కోల్‌కతా నైట్ రైడర్స్‌(Kolkata Knight Riders)తో రీ స్టార్ట్ చేయనున్నారు. యుద్ధ ప‌రిస్థితుల నేప‌థ్యంలో తిరిగి వెళ్లిన కొంద‌రు ప్లేయ‌ర్స్ రావ‌డం, మ‌రి కొంద‌రు వ‌చ్చారు. ఇటువంటి పరిస్థితిలో ఆర్‌సీబీ జట్టు బలంగా కనిపిస్తోంది. ముంబై ఇండియన్స్ చాలా పెద్ద ఎదురుదెబ్బలను ఎదుర్కొంది. ఐపీఎల్ 2025లో భాగంగా ఈ రోజు బిగ్ ఫైట్ జరగనుంది.

IPL 2025 | రీస్టార్ట్..

బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లు తలపడుతున్నాయి. రాత్రి 7:30 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్ లైవ్‌ను స్టార్ స్పోర్ట్స్, జియో హాట్ స్టార్ వేదికగా వీక్షించొచ్చు. ఈ సీజన్‌లో డిఫెండింగ్ ఛాంపియన్స్ కోల్‌కతా నైట్ రైడర్స్(Kolkata Knight Riders) అట్టర్ ఫ్లాప్ అయింది. ప్లే ఆఫ్స్ చేరుకునేందుకు ఇంకా ఆశ మిగిలి ఉంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bangalore) మాత్రం సీజన్ ఆరంభం నుంచి అదే ఉత్సాహంతో వరుస విజయాలతో దూసుకుపోతోంది. ప్లే ఆఫ్స్ వైపు అడుగులేస్తుంది. చిన్నస్వామి స్టేడియం వేదికగా ఈ రోజు జరిగే మ్యాచ్‌లో ఆర్సీబీ గెలిస్తే డైరెక్ట్‌గా ప్లే ఆఫ్స్‌లోకి వెళ్తుంది. కేకేఆర్ ఓడిపోతే ఇంటిదారి పట్టినట్టే. దాంతో ఈ రోజు జరిగే మ్యాచ్ ఇరు జట్లకి కీలకమని చెప్పుకోవచ్చు.

ఒక‌వేళ వ‌ర్షం ప‌డితే జ‌ట్టుకి చెరో పాయింట్ ల‌భిస్తుంది. అలా జ‌రిగిన ఆర్సీబీ దాదాపు ప్లే ఆఫ్స్‌కి Play offs వెళ్లిన‌ట్టే. ఐపీఎల్ 2025 పాయింట్స్ టేబుల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 11 మ్యాచ్‌లు ఆడి ఎనిమిది గెలిచి, మూడు ఓడింది. పదహారు పాయింట్లతో ప్రస్తుతం ఆర్సీబీ(RCB) సెకండ్ ప్లేస్‌లో కొనసాగుతోంది. కోల్‌కతా నైట్ రైడర్స్ 12 మ్యాచ్‌లు ఆడి ఐదు మ్యాచ్‌లలో గెలిచి, ఆరు మ్యాచ్‌లలో ఓడింది. పది పాయింట్లతో ఆరో స్థానంలో ఉంది. ఇక కింగ్ కోహ్లీ బ్యాట్ పరుగుల వర్షం కురిపిస్తోంది. విరాట్ కోహ్లీ 505 పరుగులతో పర్పుల్ క్యాప్ రేసులో నిలిచాడు.