Gold Price on august 25 | అతివ‌ల‌కు గుడ్ న్యూస్.. త‌గ్గిన బంగారం, వెండి ధ‌ర‌లు
Gold Price on august 25 | అతివ‌ల‌కు గుడ్ న్యూస్.. త‌గ్గిన బంగారం, వెండి ధ‌ర‌లు

అక్షరటుడే, వెబ్ డెస్క్: Today Gold Price : ప‌సిడి ధ‌ర‌లు Gold Rates ఎప్పుడు ఎలా మార‌తున్నాయో చెప్ప‌డం కాస్త క‌ష్టంగానే ఉంది. ఆ మ‌ధ్య ల‌క్ష మార్క్‌కి చేరిన త‌ర్వాత కాస్త త‌గ్గ‌ముఖం ప‌ట్టాయి. కొంతకాలం నుంచి బంగారం ధరలు తగ్గతూ వచ్చాయి. నెల క్రితం లక్ష రూపాయల దగ్గర ట్రేడ్ అయిన స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం ధర ఏకంగా రూ.93 వేలకు పడిపోయింది. 22 క్యారెట్ల బంగారం రూ.90వేల దిగువన ట్రేడ్ అవుతోంది. కొంచెం తగ్గితే తీసుకుందామని అనుకుంటున్న స‌మ‌యంలో బంగారం పెరుగుతూ పోతుంది. తగ్గినట్టే తగ్గిన బంగారం ధ‌ర‌లు మళ్లీ పెరిగాయి.

Today Gold Price : మ‌ళ్లీ పెరిగాయి..

హైదరాబాద్ Hyderabad నగరంలో నిన్న 10 గ్రాముల స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం ధర రూ.95,130 దగ్గర ట్రేడ్ కాగా,10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం(22 carat gold price) ధర రూ.87200 దగ్గర ట్రేడ్ అయింది. ఇక, 10 గ్రాముల 18 క్యారెట్ల ధర రూ.71,350 దగ్గర ట్రేడ్ అయింది. ఇక, ఈ రోజు చూస్తే.. 18, 22, 24 క్యారెట్ల బంగారంపై 10 రూపాయలు పెరిగింది. 10 గ్రాముల స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం ధర(24 carat gold price) ఈ రోజు రూ.95,140 దగ్గర ట్రేడ్ అవుతోంది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.87,210 దగ్గర ట్రేడ్ అవుతుండ‌డం మ‌నం గ‌మ‌నించ‌వ‌చ్చు. ఇక, 10 గ్రాముల 18 క్యారెట్ల ధర(18 carat gold price) రూ.71,360 దగ్గర ట్రేడ్ అవుతోంది.

ఇక వెండి Silver ధ‌ర‌లు విష‌యానికి వ‌స్తే.. హైదరాబాద్ నగరంలో వెండి ధరలు ప్రతీ నిత్యం తగ్గుతూ వెళుతున్నాయి. బంగారం ధరలతో సంబంధం లేకుండా వెండి ధరలు స్థిరంగా తగ్గుతుండ‌డం కొంత ఉప‌శ‌మ‌నం. నిన్న 100 గ్రాముల వెండి ధర 10,800 రూపాయల దగ్గర ట్రేడ్(trade) అయింది. కేజీ వెండి(silver KG) ధర 1,08,000 దగ్గర ట్రేడ్ అయింది. ఈ రోజు 100 గ్రాములపై 10 రూపాయలు, కేజీపై 100 రూపాయలు తగ్గింది. ఈ రోజు 100 గ్రాముల వెండి ధర 10,790 దగ్గర ట్రేడ్ అవుతోంది. కేజీ బంగారం ధర 1,07,900 దగ్గర ట్రేడ్ అవుతోంది. అయితే బంగారం ధ‌ర‌లు రానున్న రోజుల‌లో మ‌రింత పెరిగే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. అందుకే కాస్త త‌గ్గిన‌ప్పుడే కొనుక్కోవ‌డం మంచిది.