ePaper
More
    Homeఆంధ్రప్రదేశ్​Polavaram project | పోలవరం ప్రాజెక్టుపై ప్రధాని మోడీ సమీక్ష.. హాజరుకానున్న రేవంత్​, చంద్రబాబు

    Polavaram project | పోలవరం ప్రాజెక్టుపై ప్రధాని మోడీ సమీక్ష.. హాజరుకానున్న రేవంత్​, చంద్రబాబు

    Published on

    అక్షరటుడే, హైదరాబాద్: Polavaram project : ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) లో పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఇది ఇలా ఉంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ(Prime Minister Narendra Modi) పోలవరంపై దృష్టి సారించినట్లు తెలిసింది. జాతీయ ప్రాజెక్టు హోదా పొందిన పోలవరం ప్రాజెక్టుపై మే 28న ప్రధాని ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నట్లు సమాచారం. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన వివిధ అంశాలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తెలంగాణ(Telangana), ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh), ఒడిశా(Odisha), ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh) సీఎంలతో మాట్లాడనున్నట్లు తెలిసింది.

    పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనుల పురోగతిని ప్రధాని తొలిసారి సమీక్షించబోతున్నారు. ముంపు ప్రాంతాల్లో ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించబోతున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌, ఒడిశాల్లో ముంపు ప్రభావిత ప్రాంతాల్లో పబ్లిక్‌ హియరింగ్‌ నిర్వహించడంపై ఆయా రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు ఆదేశాలు జారీ చేయనున్నారు.

    2027 నాటికి పోలవరం జలాశయ నిర్మాణం పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించింది. కాగా, పోలవరం బ్యాక్ వాటర్​తో ఏర్పడే ముంపుపై తెలంగాణ ఆందోళన లేవనెత్తుతోంది. ఇదే విషయాన్ని జలశక్తి మంత్రిత్వ శాఖ(Ministry of Jal Shakti), కేంద్ర జల సంఘం(Central Water Commission) దృష్టికి తీసుకెళ్లింది. ఈ విషయంలో ఒడిశా, ఛత్తీస్‌గఢ్ సైతం ఆందోళన వ్యక్తం చేశాయి.

    ఈ మేరకు నాలుగు రాష్ట్రాల్లోని ముంపు ప్రాంతాల్లో ప్రజాభిప్రాయ సేకరణ, భూసేకరణ, నిర్వాసితులకు పునరావాస కల్పన, పనుల పురోగతిని ప్రధాని మోడీ సమీక్షించనున్నారు. గడువులోగా పనులు పూర్తి చేయడంపై ముఖ్యమంత్రులు రేవంత్‌ రెడ్డి, చంద్రబాబు నాయుడుతోపాటు ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రులతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడనున్నారు.

    Latest articles

    Vice President election | ఉప రాష్ట్రపతి ఎన్నికకు నోటిఫికేషన్​ విడుదల.. పోలింగ్​ ఎప్పుడంటే..

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice President election : భారత ఉప రాష్ట్రపతి ఎన్నిక విషయంలో కీలక అప్​డేట్​ చోటుచేసుకుంది....

    Heavy Rains | దంచికొట్టిన వాన.. లోతట్టు ప్రాంతాలు జలమయం.. అప్రమత్తంగా ఉండాలన్న అధికారులు

    అక్షరటుడే, ఇందూరు: Heavy Rains : ఉభయ కామారెడ్డి, నిజామాబాద్​ జిల్లాలను భారీ వర్షాలు ముంచెత్తాయి. గురువారం తెల్లవారుజాము...

    Gold Price | పైపైకి బంగారం ధ‌ర‌లు.. ఈ రోజు రేట్లు ఎంత ఉన్నాయంటే..!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Gold Price : భారతదేశంలో బంగారం Gold మరియు వెండి ధరలు రోజువారీగా మారుతూ ఉండడం...

    Gifty nifty | మిక్స్‌డ్‌గా గ్లోబల్‌ మార్కెట్లు.. నెగెటివ్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Gifty nifty | గ్లోబల్‌ మార్కెట్లు(Global markets) మిక్స్‌డ్‌గా సాగుతున్నాయి. బుధవారం యూఎస్‌, యూరోప్‌ మార్కెట్లు...

    More like this