ePaper
More
    Homeఅంతర్జాతీయంPak Deputy Prime Minister Ishaq Dar | ఫేక్‌ న్యూస్‌ ప్రస్తావించి నవ్వులపాలైన పాకిస్తాన్​...

    Pak Deputy Prime Minister Ishaq Dar | ఫేక్‌ న్యూస్‌ ప్రస్తావించి నవ్వులపాలైన పాకిస్తాన్​ ఉప ప్రధాని

    Published on

    అక్షరటుడే, న్యూఢిల్లీ: ఆపరేషన్‌ సిందూర్‌(Operation Sindoor)తో చావుదెబ్బ తిన్న పాక్​.. తాజాగా తప్పుడు ప్రచారంతో నవ్వులపాలైంది. ఓటమిని కప్పిపుచ్చుకునేందుకు యుద్ధంలో తామే విజయం సాధించామని భీరాలు పోతున్న పాకిస్తాన్‌.. సోషల్​ మీడియా(social media)లోని తప్పుడు వార్త(fake news) ను గుర్తించలేక భంగపాటుకు గురైంది. ఓ బ్రిటన్‌ వార్తా పత్రిక పేరుతో వచ్చిన తప్పుడు న్యూస్​ను ఆ దేశ ఉప ప్రధాని ఇషాక్ దార్ పాకిస్తాన్ పార్లమెంటు(Pakistani Parliament)లో ప్రస్తావించి నవ్వులపాలయ్యారు.

    fake news on social media : గొప్పలకు పోయి..

    ఆపరేషన్‌ సిందూర్‌(Operation Sindoor) సమయంలో పాకిస్తాన్ ఎయిర్‌ఫోర్స్‌(Pakistan Air Force)ను విదేశీ మీడియా గొప్పగా ప్రశంసించిందని పార్లమెంటులో ఇషాక్ దార్ పేర్కొన్నారు. ఆపరేషన్‌ సిందూర్‌ సమయంలో బ్రిటన్‌(British)కు చెందిన “ది డైలీ టెలిగ్రాఫ్‌”(The Daily Telegraph) పాకిస్తాన్‌ ఎయిర్‌ఫోర్స్‌ వ్యవహరించిన తీరును ప్రశంసిస్తూ కథనం ప్రచురించిందన్నారు. ఆ పత్రిక మొదటి పేజీలోని అంశాన్ని సెనేట్‌లో చూపించి గొప్పలు చెప్పుకొన్నారు.

    fake news on social media : తప్పుడు వార్తగా తేలిపోయి..​

    సదరు ప్రతికలోని మొదటి పేజీలో మే 10న ఆకాశంలో పాకిస్తాన్‌ ఎయిర్‌ఫోర్స్‌కు ఎదురులేదనే పేరుతో ఓ కథనం ప్రచురితం అయినట్లు అందులో ఉంది. అది నిజమని నమ్మిన పాకిస్తాన్​ సెనేట్(Pakistani Senate) సభ్యులు చప్పట్లతో తమ వాయుసేనను ప్రశంసిస్తూ సంబరాలు చేసుకున్నారు.

    fake news on social media : ఎక్స్ లో పోస్టు చేసి.. ఇజ్జత్​ తీసి..

    కాగా, పాకిస్తాన్‌ ఎయిర్‌ఫోర్స్‌కు ఎదురులేదని వచ్చిన సదరు కథనం.. ఏఐతో రూపొందించిన చిత్రమ(AI-generated image)ని పీఐబీ ఫ్యాక్ట్‌చెక్‌ విభాగం(PIB Fact Check department) ప్రకటించింది. ఇషాక్ దార్ వీడియోను ఎక్స్ మాధ్యమంలో పోస్ట్(posted on X) చేసి, ఆయన ప్రస్తావించింది ఫేక్ న్యూస్ అని వెల్లడించింది.

    పాక్​ చెందిన డాన్ న్యూస్(Pakistan’s Dawn News) సైతం ఇది తప్పుడు వార్త అని తేల్చి చెప్పింది. దీంతో తప్పుడు వార్తను నిజమని పాకిస్తాన్​ పార్లమెంటు వేదికగా నమ్మించాలని ప్రయత్నించిన ఇషాక్ దార్ వ్యవహారం ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా నవ్వులపాలు చేసింది. దీనిపై సోషల్​ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్(trolling) జరుగుతోంది.

    More like this

    Nepal | నేపాల్‌లో భ‌యాన‌క దృశ్యాలు.. తాడుకు వేలాడిన మంత్రులూ, ఫ్యామిలీలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nepal | నేపాల్‌లో ఇటీవల సోషల్ మీడియాపై ప్రభుత్వం విధించిన నిషేధం, రాజకీయ అవినీతి,...

     AP Government | ఏపీలో 60ఏళ్ల పురుషులు, 58 ఏళ్ల మ‌హిళ‌ల‌కి శుభ‌వార్త‌.. ద‌ర‌ఖాస్తు ఫీజు కూడా లేద‌ట‌

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : AP Government | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం(AP Government) సీనియర్ సిటిజన్ల కోసం జారీ చేసే...

    Stock Market | స్తబ్దుగా దేశీయ స్టాక్‌ మార్కెట్లు

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Stock Market | దేశీయ స్టాక్‌ మార్కెట్‌ (Domestic Stock Market) స్తబ్ధుగా సాగుతోంది. స్వల్ప...