ePaper
More
    HomeజాతీయంCongress alleges Operation Sindoor | పొలిటిక‌ల్ మైలేజ్ కోసం బీజేపీ య‌త్నం.. ఆప‌రేష‌న్ సిందూర్‌పై...

    Congress alleges Operation Sindoor | పొలిటిక‌ల్ మైలేజ్ కోసం బీజేపీ య‌త్నం.. ఆప‌రేష‌న్ సిందూర్‌పై కాంగ్రెస్ ఆరోప‌ణ‌

    Published on

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Congress alleges Operation Sindoor : అధికార బీజేపీ ద్వంద ప్ర‌మాణాల‌ను పాటిస్తోంద‌ని, ఆపరేషన్ సిందూర్ కింద భారతదేశం చేపట్టిన సైనిక చర్య నుంచి “పొలిటిక‌ల్ మైలేజ్” పొందేందుకు ప్ర‌య‌త్నిస్తున్న‌ద‌ని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. అందులో భాగంగానే ఎన్డీయే ముఖ్య‌మంత్రుల(NDA chief ministers)ను మాత్ర‌మే ప్ర‌ధాన‌మంత్రి మోదీ వ‌చ్చే వారం స‌మావేశం కానున్నార‌ని తెలిపింది. ఈ స‌మావేశానికి కాంగ్రెస్ ముఖ్య‌మంత్రుల‌ను పిలువ‌రు. కానీ, విదేశాల‌కు వెళ్లే అఖిల‌ప‌క్ష ఎంపీల బృందంలో మాత్రం చోటు క‌ల్పిస్తుంద‌ని ఎద్దేవా చేశారు. ఈ మేర‌కు కాంగ్రెస్ సీనియ‌ర్ నేత జైరాం ర‌మేశ్(Senior Congress leader Jairam Ramesh) X లో పోస్టు చేశారు.

    “ఆపరేషన్ సిందూర్ నుండి పొలిటిక‌ల్‌ మైలేజ్ పొందేందుకు ప్రధానమంత్రి మే 25న ఎన్డీయే ముఖ్యమంత్రుల సమావేశానికి పిలుపునిచ్చారు. కానీ పాకిస్తాన్ ఎగ‌దోస్తున్న‌ ఉగ్రవాదంపై భారత యొక్క వైఖరిని వివరించడానికి అన్ని పార్టీల ఎంపీలు ప్రతినిధి బృందంగా విదేశాలకు వెళ్లాలని ఆయన ఇప్పుడు కోరుకుంటున్నారు. అయితే, ఆప‌రేష‌న్ సిందూర్ విష‌యంలో మాత్రం మోదీ కాంగ్రెస్ ముఖ్య‌మంత్రుల‌(Congress Chief Ministers)ను కలువ‌ర‌ని” ఎద్దేవా చేశారు. అంతర్జాతీయ ప్రతినిధులతో స‌మావేశంలో కాంగ్రెస్ పార్టీ కచ్చితంగా పాల్గొంటుందని ర‌మేశ్ తెలిపారు. అయితే, ఒక స‌మావేశానికి పిలిచి, మ‌రో స‌మావేశానికి దూరం పెట్ట‌డం ద్వారా బీజేపీ ద్వంద్వ ప్రమాణాలను పాటిస్తోంద‌ని విమ‌ర్శించారు.

    Congress alleges Operation Sindoor : కించ‌ప‌రిచేలా బీజేపీ తీరు..

    పాకిస్తాన్‌(Pakistan)పై ఇండియా సైనిక చర్య సమయంలో పార్టీల మధ్య ఐక్యత, సంఘీభావం కోసం పిలుపునిచ్చినప్పటికీ, ప్రధానమంత్రి, బీజేపీ నిరంతరం కాంగ్రెస్‌ను కించపరుస్తున్నారని రమేశ్ ఆరోపించారు. “భారత జాతీయ కాంగ్రెస్ సమష్టి సంకల్పాన్ని ప్రదర్శించాలని, ఫిబ్రవరి 22, 1994న పార్లమెంట్ ఏకగ్రీవంగా ఆమోదించిన తీర్మానాన్ని పునరుద్ఘాటించడానికి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయమ‌ని మేము డిమాండ్ చేస్తే ప్రధానమంత్రి అంగీకరించలేదు” అని గుర్తు చేశారు.

    “ఇప్పుడు అకస్మాత్తుగా ప్రధానమంత్రి(Prime Minister) పాకిస్తాన్ నుంచి ఉగ్రవాదంపై భారత వైఖరిని వివరించడానికి బహుళ పార్టీ ప్రతినిధులను విదేశాలకు పంపాలని నిర్ణయించుకున్నారు. కాంగ్రెస్ ఎల్లప్పుడూ అత్యున్నత జాతీయ ప్రయోజనాల కోసం ఒక స్టాండ్ తీసుకుంటుంది. బిజెపి(BJP) చేసినట్లుగా జాతీయ భద్రతా సమస్యలను ఎప్పుడూ రాజకీయం చేయదని” స్ప‌ష్టం చేశారు.

    More like this

    Asia Cup Cricket | ఆతిథ్య జట్టును చిత్తుగా ఓడించిన భారత్​

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Asia Cup Cricket : యూఏఈ UAE లో జరిగిన ఆసియా కప్ Asia Cup...

    attempted to murder | భార్యపై హత్యాయత్నం.. భర్తకు ఐదేళ్ల కఠిన కారాగారం

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: attempted to murder : భార్యపై హత్యాయత్నం చేసిన భర్తకు ఐదేళ్ల కఠిన కారాగార...

    police officer threw money | లంచం తీసుకుంటూ దొరికాడు.. పట్టుకోబోతే గాల్లో నగదు విసిరేసిన పోలీసు అధికారి!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: police officer threw money : అతడో అవినీతి పోలీసు అధికారి. ప్రభుత్వం నుంచి రూ.లక్షల్లో...