ePaper
More
    Homeక్రీడలుIND vs ENG : భారత్-ఏ జట్టును ప్రకటించిన బీసీసీఐ

    IND vs ENG : భారత్-ఏ జట్టును ప్రకటించిన బీసీసీఐ

    Published on

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: ఇంగ్లండ్ పర్యటన(England tour)కు వెళ్లే భారత్-ఏ జట్టును బీసీసీఐ ప్రకటించింది. 20 మంది ఆటగాళ్లతో కూడిన జంబో టీమ్‌ వివరాలను శుక్రవారం వెల్లడించింది. ఇంగ్లండ్‌తో ఐదు టెస్ట్‌ల సిరీస్‌కు ముందు సన్నాహకంగా భారత్-ఏ, ఇంగ్లండ్ లయన్స్(India A – England Lions) జట్లు రెండు అనధికారిక టెస్ట్‌లు ఆడనున్నాయి.

    అక్కడి పరిస్థితులకు అలవాటు పడేందుకు భారత్-ఏ టీమ్‌లో సీనియర్ ఆటగాళ్లను ఎంపిక చేశారు. శుభ్‌మన్ గిల్, సాయి సుదర్శన్(Shubman Gill, Sai Sudarshan) రెండో ప్రాక్టీస్ మ్యాచ్‌కు అందుబాటులోకి వస్తారని బీసీసీఐ(BCCI) తెలిపింది. తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డితో పాటు ధ్రువ్ జురెల్, ఇషాన్ కిషన్, సర్ఫరాజ్ ఖాన్‌ల(Telugu star Nitish Kumar Reddy, Dhruv Jurel, Ishan Kishan, Sarfaraz Khan)కు భారత్-ఏ జట్టులో చోటు కల్పించారు. దేశవాళీ క్రికెట్‌లో నిలకడగా రాణించిన కరుణ్ నాయర్‌తో పాటు శార్దూల్ ఠాకూర్‌ను కూడా ఎంపిక చేశారు.

    ఈ ప్రాక్టీస్ మ్యాచ్‌ల్లో సత్తా చాటిన ఆటగాళ్లకు భారత ప్రధాన జట్టులో చోటు దక్కే అవకాశం ఉంది. భారత్-ఏ టీమ్‌ మే 25 తర్వాత ఇంగ్లండ్ బయల్దేరే అవకాశం ఉంది. భారత్-ఏ జట్టులో ఉండి.. ఐపీఎల్ ప్లే ఆఫ్స్ ఆడే ఆటగాళ్లు ఆలస్యంగా జట్టుతో కలవనున్నారు. మే 30 నుంచి అనధికారిక టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుంది. అందరూ ఊహించనట్లుగానే శ్రేయస్ అయ్యర్‌‌‌ను ఎంపిక చేయలేదు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ(Virat Kohli, Rohit Sharma) టెస్ట్‌ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించడంతో వారి స్థానాలను ఎవరితో భర్తీ చేస్తారనేది ఆసక్తికరంగా మారింది.

    భారత్-ఏ జట్టు: అభిమన్యు ఈశ్వరన్(కెప్టెన్), యశస్వి జైస్వాల్, కరుణ్ నాయర్, ధ్రువ్ జురెల్(వైస్ కెప్టెన్), నితీష్ కుమార్ రెడ్డి, శార్దూల్ ఠాకూర్, ఇషాన్ కిషన్(కీపర్), మానవ్ సుతార్, తనూష్ కోటియన్, ముఖేష్ కుమార్, ఆకాశ్ దీప్, హర్షిత్ రాణా, అన్షుల్ కంబోజ్, ఖలీల్ అహ్మద్, రుతురాజ్ గైక్వాడ్, సర్ఫరాజ్ ఖాన్, తుషార్ దేశ్‌పాండే, హర్ష్ దూబే.

    More like this

    Apple iPhone 17 | ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ఐఫోన్ 17 సిరీస్ విడుదల.. అతి సన్నని మొబైల్ ఫీచర్లు, ధర వివ‌రాలు ఇవే

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Apple iPhone 17 | టెక్ ప్రియులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న Apple iPhone...

    High Court | పవన్‌ కల్యాణ్‌ ఫొటోలు పెట్టొద్దు.. హైకోర్ట్‌లో పిల్ దాఖ‌లు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : High Court | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కార్యాలయాల్లో చట్టబద్ధమైన అనుమతి లేకుండా ఉప ముఖ్యమంత్రి...

    Hyderabad | మండీ బిర్యానీలో బొద్దింక.. షాకైన కస్టమర్లు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hyderabad | అరేబియన్​ మండీ బిర్యానీ (Arabian Mandi Biryani) తింటుండగా.. బొద్దింక రావడంతో...