- Advertisement -
HomeUncategorizedUnion Minister Rajnath Singh | ఇది ట్రైల‌రే.. సినిమా ముందుంది.. కేంద్ర మంత్రి రాజ్‌నాథ్...

Union Minister Rajnath Singh | ఇది ట్రైల‌రే.. సినిమా ముందుంది.. కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్

- Advertisement -

అక్షరటుడే, న్యూఢిల్లీ: Union Minister Rajnath Singh : పాకిస్తాన్‌(Pakistan)తో ఇటీవ‌ల జ‌రిగిన పోరు కేవ‌లం ట్రైల‌రేన‌ని, అస‌లు సినిమా ముందుంద‌ని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. ఆప‌రేష‌న్ సిందూర్(Operation Sindoor) ఇంకా ముగియ‌లేద‌ని, కాల్పుల విర‌మ‌ణ అన్న‌ది పాకిస్తాన్ తీరుపైనే ఆధార‌ప‌డి ఉంటుంద‌న్నారు. పాకిస్తాన్‌కు ఇటీవల మంజూరు చేసిన రుణం విష‌యంలో పునఃపరిశీలించాలని శుక్రవారం అంతర్జాతీయ ద్రవ్య నిధి (International Monetary Fund – IMF)కి విజ్ఞ‌ప్తి చేశారు. ఐఎంఎఫ్ ఇచ్చే ఈ నిధులలో పెద్ద‌మొత్తాన్ని పాకిస్తాన్ ఉగ్రవాద మౌలిక సదుపాయాలకు మళ్లిస్తుంద‌ని హెచ్చ‌రించారు. ఐక్య‌రాజ్య‌స‌మితి(United Nations) నిషేధిత ఉగ్ర‌వాదిగా ప్ర‌క‌టించిన మ‌సూద్ అజార్‌కు భ‌ద్ర‌త‌ను స‌మ‌కూర్చ‌డానికి త‌న పౌరుల ఆదాయం నుంచి రూ.14 కోట్ల చొప్పున ఖ‌ర్చు చేస్తుంద‌ని చెప్పారు.

గుజరాత్‌(Gujarat)లోని భుజ్ వైమానిక దళ స్థావరాన్ని(Bhuj Air Force base) శుక్ర‌వారం ప‌రిశీలించిన రాజ్‌నాథ్‌సింగ్‌.. వైమానిక సిబ్బందిని ఉద్దేశించి ప్ర‌సంగించారు. పాకిస్తాన్ తన ఉగ్రవాద మౌలిక సదుపాయాలను పునర్నిర్మించడానికి చేస్తున్న ప్రయత్నాలపై తీవ్ర ఆందోళన వ్య‌క్తం చేశారు. ఇటీవ‌ల ఐఎంఎఫ్ పాకిస్తాన్‌కు రుణ‌మిచ్చేందుకు అంగీక‌రించింది. అయితే, ఇస్లామాబాద్‌కు బిలియన్ డాలర్ల సహాయం చేయాల‌న్న నిర్ణ‌యాన్ని పునఃపరిశీలించాలని రాజ్‌నాథ్ ఈ సంద‌ర్భంగా అంతర్జాతీయ ద్రవ్య నిధిని కోరారు.

- Advertisement -

Union Minister Rajnath Singh : నిధుల‌న్నీ ఉగ్ర‌వాదానికే..

పాకిస్తాన్‌కు త‌న‌కు వ‌చ్చే రుణాలతో పాటు ప్ర‌జ‌లు క‌ట్టే ప‌న్నుల నుంచి వ‌చ్చే ఆదాయాన్ని సైతం ఉగ్ర‌వాద మౌలిక స‌దుపాయాల కోసం వెచ్చిస్తోంద‌ని రాజ్‌నాథ్‌సింగ్ విమ‌ర్శించారు. “జైషే మొహమ్మద్ ఉగ్రవాద సంస్థ చీఫ్‌ మసూద్ అజార్(Jaish-e-Mohammed chief Masood Azhar) భ‌ద్ర‌త కోసం పాకిస్తాన్ తన పౌరుల నుంచి వసూలు చేసిన పన్ను దాదాపు రూ.14 కోట్లు ఖర్చు చేస్తోంది. అతన్ని ఐక్యరాజ్యసమితి ఉగ్రవాదిగా ప్ర‌క‌టించినప్పటికీ అత‌డి భ‌ద్రంగా చూసుకుంటోంది. మురిద్కే, బహవల్‌పూర్‌లో ఉన్న లష్కరే తోయిబా, జైషే మొహమ్మద్ ఉగ్రవాద మౌలిక సదుపాయాలను పునర్నిర్మించడానికి పాకిస్తాన్ ప్రభుత్వం ఆర్థిక సహాయం ప్రకటించింది” అని రాజ్‌నాథ్ సింగ్ వెల్ల‌డించారు. పాకిస్తాన్‌కు ఐఎంఎఫ్ అందించే 1 బిలియన్ డాలర్ల సహాయంలో ఎక్కువ భాగం ఉగ్రవాద మౌలిక సదుపాయాలకు నిధులు సమకూరుస్తుందన్నారు.

Union Minister Rajnath Singh : ఇది ట్రైల‌ర్ మాత్ర‌మే.. సినిమా ముందుంది..

ప్రస్తుత కాల్పుల విరమణ పాకిస్తాన్‌ను పరిశీలనలో ఉంచిందని, భవిష్యత్తు చర్యలు దాని ప్రవర్తనపై ఆధారపడి ఉంటాయని రాజ్‌నాథ్ స్ప‌ష్టం చేశారు. “ప్రవర్తన మెరుగుపడితే ఒకే. కానీ ఏదైనా భంగం కలిగితే, కఠినమైన శిక్ష త‌ప్ప‌ద‌ని” అని సింగ్ హెచ్చ‌రించారు. ‘మా చర్యలు కేవలం ట్రైలర్ మాత్రమే’: ఆపరేషన్ సిందూర్ ఇంకా ముగియలేదని” అన్నారు ఆపరేషన్ సిందూర్‌లో నిర్ణయాత్మక పాత్ర పోషించినందుకు భారత వైమానిక దళం సిబ్బందిని ఆయన ప్రశంసించారు. ఈ ఆపరేషన్ ప్రపంచ గుర్తింపును పొందిందన్నారు. పాకిస్తాన్, పీవోకేలోని ఉగ్రవాద శిబిరాలను కేవలం 23 నిమిషాల్లోనే తటస్థీకరించినందుకు వైమానిక యోధులను ఆయన ప్రశంసిస్తూ, “శత్రు భూభాగంలోకి క్షిపణులను ప్రయోగించినప్పుడు, భారతదేశ శౌర్యం, శక్తి ప్రతిధ్వనులను ప్రపంచం విన్నది” అని అన్నారు.

- Advertisement -
- Advertisement -
Must Read
Related News