Pahalgam attack | పచ్చిక భూముల్లో నెత్తుటేరులు.. పహల్గామ్ దాడిలో 27 మంది మృత్యువాత
Pahalgam attack | పచ్చిక భూముల్లో నెత్తుటేరులు.. పహల్గామ్ దాడిలో 27 మంది మృత్యువాత

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Pahalgam attack | జమ్మూ కాశ్మీర్లోని Jammu and Kashmir పచ్చిక భూముల్లో grasslands నెత్తుటేరులు పారాయి. ఉగ్రవాదుల terrorists కాల్పుల్లో 27 మంది పర్యాటకుల ప్రాణాలు గాల్లో కలిసి పోయాయి. ఇందులో భారతీయులతో పాటు విదేశీ పర్యాటకులు foreign tourists సైతం ఉండడం కలవరపెడుతున్నది. ఉగ్రదాడులు terrorist attacks జరిగే అవకాశముందని నిఘా వర్గాలు ఇటీవలే హెచ్చరించాయి. ముంబై పేలుళ్ల Mumbai blasts కుట్రదారు తహవూర్ రాణాను Tahawuor Rana అమెరికా భారత్ కు అప్పగించిన తర్వాత ఈ హెచ్చరికలు జారీ అయ్యాయి. నిఘా వర్గాలు intelligence హెచ్చరించినట్లుగా మంగళవారం ఉగ్రవాదులు terrorists రెచ్చిపోయారు. మినీ స్విట్జర్లాండ్ గా mini Switzerland భావించే పహల్ గామ్ లో పర్యాటకులపై కాల్పులకు తెగబడ్డారు. సైనిక దుస్తుల్లో వచ్చిన ఇద్దరు, ముగ్గురు వ్యక్తులు విచక్షణారహితంగా కాల్పులు జరిపి పారిపోయారు.

Pahalgam attack | అతి పెద్ద దాడి..

పహల్ గామ్ Pahalgam ఘటన జమ్మూ కాశ్మీర్లో Jammu and Kashmir  జరిగిన అతిపెద్ద దాడుల్లో biggest attacks ఒకటిగా చెబుతున్నారు. దుండగుల కాల్పుల్లో 27 మంది మృతి చెందడం తీవ్ర విషాదం నింపింది. లష్కరే తొయిబాతో Lashkar-e-Taiba సంబంధం ఉన్న ఉగ్రవాదులు పర్యాటకుల బృందంపై కాల్పులు జరిపారు. ఈ దాడికి పాల్పడింది తామేనని లష్కరే అనుబంధ సంస్థ అయిన రెసిస్టెన్స్ ఫ్రంట్ వెల్లడించింది.

Pahalgam attack | పర్యాటకులకు స్వర్గధామం..

జమ్మూకాశ్మీర్ Jammu and Kashmir అంటేనే ప్రకృతి అందాలకు నెలవు. భూతల స్వర్గంగా భావించే ఈ ప్రాంతంలో పహల్ గామ్ Pahalgam ఎంతో ప్రసిద్ధి చెందింది. ఇక్కడి బైసరన్ పచ్చిక భూముల్లో గుర్రం స్వారీని ఆస్వాదిస్తున్న పర్యాటకులపై సైనిక దుస్తులు military uniforms ధరించిన ఇద్దరు, ముగ్గురు ఉగ్రవాదులు terrorists విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ప్రాణభయంతో పర్యాటకులు తలోదిక్కు పారిపోయారు. సమాచారం అందుకున్న భద్రతాబలగాలు సహాయక చర్యలు చేపట్టాయి. తొలుత ముగ్గురు మృతి చెందారని ప్రకటించినప్పటికీ ఆ సంఖ్య 27కు చేరింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని చెబుతున్నారు.

Pahalgam attack | భద్రతా బలగాల కూంబింగ్..

కాల్పులు జరిపిన ఉగ్రవాదుల terrorists కోసం భద్రతా దళాలు security forces కూంబింగ్ ప్రారంభించాయి. ఆ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నాయి. సౌదీ పర్యటనలో saudi Arabia ఉన్న ప్రధాని మోదీ prime minister Modi కాల్పుల ఘటన గురించి తెలియగానే వెంటనే వీడియో కాన్ఫరెన్స్ video conference ద్వారా ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఉగ్రదాడిని ఖండించిన terror attack ఆయన.. హంతకులను వదిలి పెట్టమని హెచ్చరించారు. మరోవైపు, పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా union home minister amit shah ప్రధాని prime minister ఆదేశాల మేరకు హుటాహుటిన కాశ్మీర్ కు బయల్దేరారు.