అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Maheshwar Reddy | బీజేపీ BJP శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి Maheshwar Reddy సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఏ క్షణమైనా ముఖ్యమంత్రి CM మారొచ్చన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు. సీఎం రేవంత్‌రెడ్డి CM Revanth Reddy, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క Deputy CM Bhatti Vikramarka మధ్య విభేదాలున్నాయని ఆయన ఆరోపించారు. రాష్ట్ర మంత్రివర్గం రెండుగా చీలిపోయిందని వ్యాఖ్యానించారు. రాష్ట్రం దివాలా తీసిందని రేవంత్ చేసిన వ్యాఖ్యలపై మంత్రివర్గం state cabinet అసంతృప్తిగా ఉందన్నారు. సీఎం, మంత్రుల తీరుతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దిగజారుతోందని విమర్శించారు.
Maheshwar Reddy | మంత్రివర్గ విస్తరణను అడ్డుకుంటున్న సీఎం
రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ cabinet expansion జరగకుండా సీఎం రేవంత్‌రెడ్డి అడ్డుకుంటున్నారని మహేశ్వర్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్‌రెడ్డి తీరుతో కాంగ్రెస్ మళ్లీ పదేళ్ల దాకా అధికారంలోకి వచ్చే అవకాశం లేదని కాంగ్రెస్ నాయకులు భావిస్తున్నారని చెప్పారు. రేవంత్ తప్పులన్నీ కాంగ్రెస్ హైకమాండ్ congress Highcommand దగ్గర ఉన్నాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల Local body elections తర్వాత కాంగ్రెస్ అధిష్టానం సీఎంను మార్చే అవకాశం ఉందన్నారు.
కాగా.. ఇటీవల బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ nvss prabhakar సైతం రాష్ట్రంలో సీఎం మారుతారని చెప్పారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసిపోయాయని ఆయన ఆరోపించారు. రేవంత్‌రెడ్డి స్థానంలో కేసీఆర్ సీఎం అవుతారని సంచలన వ్యాఖ్యలు చేశారు.