అక్షరటుడే, గాంధారి: Gandhari | మండలకేంద్రంలోని బస్టాండ్‌లో శుక్రవారం పోలీసు కళాజాత (Police Kalajatha) నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై ఆంజనేయులు మాట్లాడుతూ.. ఎస్పీ రాజేశ్‌చంద్ర (SP Rajesh Chandra) ఆదేశాల మేరకు కార్యక్రమం నిర్వహించినట్లు పేర్కొన్నారు. వేసవి సెలవుల నేపథ్యంలో దొంగతనాలకు ఆస్కారం ఉంటుందని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇళ్లకు తాళం వేసి వేరే ఊరికి వెళితే, సమీప పోలీస్ స్టేషన్‌లో సమాచారమివ్వాలన్నారు. అలాగే విద్యార్థులు చెరువులు, కుంటల్లో ఈతకు వెళ్లి ప్రాణాల మీదికి తెచ్చుకోవద్దని పేర్కొన్నారు. సైబర్ నేరాల (Cyber crime) పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎవరైనా మోసపోతే 1930కి ఫోన్ చేయాలని సూచించారు. కార్యక్రమంలో కళాబృందం సభ్యులు, భరోసా టీం, తదితరులు పాల్గొన్నారు.