ePaper
More
    Homeక్రీడలుRavi Shastri | కోహ్లీ రిటైర్మెంట్‌కు కారణం అదే..: రవి శాస్త్రి

    Ravi Shastri | కోహ్లీ రిటైర్మెంట్‌కు కారణం అదే..: రవి శాస్త్రి

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Ravi Shastri | విరాట్ కోహ్లీ మానసికంగా అలసిపోవడంతోనే టెస్ట్ క్రికెట్‌(Test Cricket)కు వీడ్కోలు పలికాడని టీమిండియా మాజీ కోచ్ రవి శాస్త్రి(Former Coach Ravi Shastri) తెలిపాడు. కోహ్లీ తన నిర్ణయాన్ని వెల్లడించే వారం ముందు అతనితో మాట్లాడినట్లు చెప్పాడు. రిటైర్మెంట్ విషయంలో విరాట్ కోహ్లీ(Virat Kohli) చాలా స్పష్టంగా ఉన్నాడని, అతనికి ఎలాంటి పశ్చాత్తాపం లేదన్నాడు.

    ఆటలో రాణించాల్సినంత రాణించాననే స్పష్టతతో కోహ్లీ ఉన్నాడని, చాలా సంతోషంగా ఆటకు వీడ్కోలు పలికాడని చెప్పాడు. అయితే కోహ్లీ నిర్ణయం షాక్‌కు గురి చేసిందని చెప్పిన రవి శాస్త్రి.. మరో రెండు, మూడేళ్లు ఆడే సత్తా అతనిలో ఉందన్నాడు. కోహ్లీ శారీరకంగా ఫిట్‌గా ఉన్నా.. మానసికంగా బాగా అలసిపోయాడని తెలిపాడు.

    సాధారణంగా ఏ ఆటగాడైనా తన బాధ్యతను పూరి చేసి ప్రశాంతంగా ఉంటాడని, కోహ్లీ మాత్రం అన్ని వికెట్లు తానే తీయాలి, అన్ని క్యాచ్‌లు తానే పట్టాలి, అన్ని నిర్ణయాలు తానే తీసుకోవాలి అన్నట్లు వ్యవహరిస్తాడని చెప్పాడు. ఆట తీవ్రత ఆ స్థాయిలో ఉంటే మానసికంగా అలసటకు గురువుతారని తెలిపాడు. కోహ్లీ తన కెరీర్‌లో అన్నీ సాధించాడని, అతను గర్వించదగిన వారసత్వాన్ని మిగిల్చాడని శాస్త్రి కొనియాడాడు. కోహ్లీ టెస్ట్ క్రికెట్‌(Test Cricket)కు చేసిన సేవలను, ఆట పట్ల అతనికున్న అంకితభావాన్ని శాస్త్రి ప్రశంసించాడు.

    More like this

    ACB Raids | ఏసీబీ అధికారుల దూకుడు.. పాఠశాలల్లో తనిఖీలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : ACB Raids | ఏసీబీ అధికారులు దూకుడు పెంచారు. నిత్యం దాడులు చేపడుతూ.. అవినీతి...

    Excise Department | మత్తుపదార్థాలు రవాణా చేస్తున్న ఒకరి అరెస్ట్

    అక్షరటుడే నిజామాబాద్ సిటీ: Excise Department | అల్ప్రాజోలం రవాణా చేస్తున్న ఒకరిని ఎక్సైజ్ పోలీసులు అరెస్టు చేశారు....

    Mumbai Navy Yard | నేవీ యార్డులో ఆయుధాల చోరీ.. నేవీ కానిస్టేబుల్, అతడి సోదరుడి అరెస్టు

    అక్షరటుడే, వెబ్ డెస్క్: Mumbai Navy Yard | తెలంగాణకు చెందిన నేవీ కానిస్టేబుల్ (Navy Constable) దొంగ...