ePaper
More
    Homeక్రీడలుTeam India | భారత జట్టుకు గౌతమ్ గంభీరే సర్వాధికారి: మాజీ క్రికెటర్

    Team India | భారత జట్టుకు గౌతమ్ గంభీరే సర్వాధికారి: మాజీ క్రికెటర్

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Team India | టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma), మాజీ కెప్టెన్‌ విరాట్ కోహ్లీ(Virat Kohli) టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన నేపథ్యంలో మాజీ క్రికెటర్ సబా కరీం ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇక నుంచి టీమిండియాను హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్(Gautam Gambhir) శాసిస్తాడని తెలిపాడు. కుర్రాళ్లతో కూడిన భారత జట్టుకు గంభీరే సర్వాధికారి కాబోతున్నాడని అభిప్రాయపడ్డాడు. శుభ్‌మన్ గిల్, జస్‌ప్రీత్ బుమ్రా భారత జట్టు పగ్గాలు అందుకున్నా.. గంభీర్‌దే పూర్తి ఆధిపత్యం ఉంటుందని చెప్పాడు. జట్టు ఎంపిక నుంచి వ్యూహాల వరకు అన్ని తన పర్యవేక్షణలోనే జరుగుతాయని తెలిపాడు.

    ‘టెస్ట్ క్రికెట్‌కు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వీడ్కోలు పలకడంతో భారత జట్టులో గౌతమ్ గంభీర్ కీలక వ్యక్తిగా మారనున్నాడు. ఎందుకంటే అతనే ఆటగాళ్లను నడిపించనున్నాడు. అయితే అతను కొత్త కెప్టెన్‌ను, అతను ఆడాలనుకుంటున్న బ్రాండ్ ఆఫ్ క్రికెట్‌ను బాగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. టీమిండియా(Team India) అప్రోచ్ గురించి గంభీర్ స్పష్టమైన ప్రణాళికలతో ఉన్నాడు.

    ఆటగాళ్లకు అండగా ఉంటూ పవర్‌ఫుల్ లీడర్స్‌ను తయారు చేయడంపై గంభీర్ ఫోకస్ పెట్టాలి. ఆస్ట్రేలియా పర్యటనలో విఫలమైన రిషభ్ పంత్‌(Rishabh Panth)కు గంభీర్ కచ్చితంగా అండగా ఉంటాడు. ఇంగ్లండ్ పర్యటనలో రాణించేలా అతన్ని ప్రోత్సహిస్తాడు. దేశవాళీ క్రికెట్‌లో రాణించే ఆటగాళ్లకు గంభీర్ ప్రాధాన్యత ఇవ్వాలి. శ్రేయస్ అయ్యర్, అభిమన్యు ఈశ్వరన్ వంటి ఆటగాళ్లను ఎంపిక చేసి వారికి తగిన అవకాశాలు ఇవ్వాలి’ అని సబా కరీమ్(Sabah Karim) చెప్పుకొచ్చాడు.

    More like this

    Nepal Govt | నేపాల్‌లో తాత్కాలిక ప్రభుత్వం..? మాజీ సీజే సుశీలా కార్కీని నియమించాలని జెన్ జడ్ పట్టు

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Nepal Govt | రెండ్రోజులుగా నిరసనలు, అల్లర్లతో అట్టుడికి పోయిన నేపాల్(Nepal)లో ఇప్పుడిప్పుడి శాంతియుత పరిస్థితులు...

    Diabetes | షుగర్ వ్యాధి పట్ల జాగ్రత్తలు పాటించాలి

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Diabetes | షుగర్ వ్యాధి (Diabetes) పట్ల పలు జాగ్రత్తలు పాటిస్తే ఈ వ్యాధిని...

    Care Degree College | 12న కేర్ డిగ్రీ కళాశాలలో రిక్రూట్​మెంట్ డ్రైవ్

    అక్షరటుడే, ఇందూరు: Care Degree College | నగరంలోని కేర్ డిగ్రీ కళాశాలలో ఈనెల 12న రిక్రూట్ మెంట్...