ePaper
More
    Homeఆంధ్రప్రదేశ్​TTD Darshan | శ్రీవారి భక్తులకు అలర్ట్​.. ఆగస్టు బుకింగ్స్ అప్పుడే..

    TTD Darshan | శ్రీవారి భక్తులకు అలర్ట్​.. ఆగస్టు బుకింగ్స్ అప్పుడే..

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: TTD Darshan | తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) శ్రీవారి భక్తులకు గుడ్​ న్యూస్​ చెప్పింది. ఆగస్టు నెలకు సంబంధించి వివిధ టికెట్ల బుకింగ్​ తేదీలను ప్రకటించింది. ఆగస్టుకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు, వసతి కోసం ఆన్‌లైన్ కోటాను టీటీడీ అధికారిక వెబ్‌సైట్(TTD official website)​లో మే 19న ఉదయం 10 గంటలకు విడుదల చేస్తుంది. ఈ టికెట్ల కోసం భక్తులు ఎలక్ట్రానిక్ డిప్ కోసం మే 21న ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌(Online)లో నమోదు చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్​ చేసుకున్న వారు మే 21 నుంచి 23 మధ్యాహ్నం 12 గంటలలోపు చెల్లింపులు పూర్తి చేస్తే లక్కీ డిప్‌లో టికెట్లు మంజూరవుతాయి.

    TTD Darshan | 22న ఆర్జిత సేవా టికెట్లు

    శ్రీవారి కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవ, శ్రీ‌వారి సాల‌క‌ట్ల ప‌విత్రోత్స‌వాల‌ టికెట్లను మే 22న ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు. వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన ఆగ‌స్టు నెల కోటాను మే 22న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ విడుదల చేయనుంది.

    TTD Darshan | అంగప్రదక్షిణం టోకెన్లు

    ఆగ‌స్టుకు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను మే 23న ఉదయం 10 గంటలకు, శ్రీవాణి ట్రస్టు టికెట్లను మే 23న ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నారు. వ‌యోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘ‌కాలిక వ్యాధులున్న‌వారు తిరుమల శ్రీ‌వారిని ద‌ర్శించుకునేందుకు వీలుగా ఆగ‌స్టు నెల ఉచిత‌ ప్ర‌త్యేక ద‌ర్శ‌నం టోకెన్ల కోటాను మే 23న మధ్యాహ్నం 3 గంట‌ల‌కు ఆన్‌లైన్‌లో పెట్టనుంది.

    TTD Darshan | ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా

    ఆగ‌స్టు నెల‌కు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను మే 24న ఉదయం 10 గంటలకు, తిరుమల, తిరుపతిల‌లో ఆగ‌స్టు నెల గదుల కోటాను మే 24న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు. శ్రీవారి సేవ(తిరుమల, తిరుపతి), పరకామణి సేవ, నవనీత సేవ, టీమ్ లీడర్స్ (సీనియర్ సేవక్స్) సేవల జూలై కోటాను మే 29న ఉదయం 11 గంటలకు టీటీడీ తన వెబ్​సైట్​(Web Site)లో విడుదల చేయనుంది.

    More like this

    Gold Prices Hike | పసిడి పరుగులు.. నాన్‌స్టాప్‌గా పెరుగుతున్న ధ‌ర‌లు!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Gold Prices Hike : ఇటీవ‌లి కాలంలో బంగారం, వెండి ధ‌ర‌లు Silver Prices అంత‌కంత...

    Wallstreet | లాభాల్లో గ్లోబల్‌ మార్కెట్లు.. గ్యాప్‌ అప్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Wallstreet : వాల్‌స్ట్రీట్‌(Wallstreet)లో జోరు కొనసాగుతుండగా.. యూరోప్‌ మార్కెట్లు మాత్రం మిక్స్‌డ్‌గా ముగిశాయి. బుధవారం ఉదయం...

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం తేదీ (DATE) – సెప్టెంబరు 10,​ 2025 పంచాంగం శ్రీ విశ్వావసు...