ePaper
More
    HomeజాతీయంDefence Ministry | భారత్​ కీలక నిర్ణయం.. రక్షణ శాఖకు భారీగా నిధులు!

    Defence Ministry | భారత్​ కీలక నిర్ణయం.. రక్షణ శాఖకు భారీగా నిధులు!

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Defence Ministry | భారత రక్షణ రంగాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా కేంద్రం అనేక చర్యలు చేపడుతోంది. ఇప్పటికే పలు దేశాల నుంచి ఆయుధాలు కొనుగోలు చేయడంతో దేశీయంగా ఆయుధాలను తయారు చేస్తోంది. ముఖ్యంగా వివిధ రకాల మిసైళ్లను రూపొందిస్తోంది. అయితే ఆపరేషన్​ సిందూర్(Operation Sindoor)​ అనంతర పరిణామాల నేపథ్యంలో రక్షణ రంగానికి భారీగా నిధులు ఇవ్వాలని కేంద్రం నిర్ణయించినట్లు సమాచారం.

    Defence Ministry | అదనంగా రూ.50 వేల కోట్లు

    ఈ ఆర్థిక సంవత్సరంలో రక్షణ శాఖకు రూ.6.81 లక్షల కోట్ల బడ్జెట్​ కేటాయించారు. అయితే పహల్​గామ్​ ఉగ్రదాడి(Pahalgam terror attack) అనంతరం భారత్​ ఆపరేషన్​ సిందూర్​ చేపట్టి పీవోకేతో పాటు పాకిస్తాన్​లోని 9 ఉగ్ర శిబిరాలను ధ్వంసం చేసింది. భారత్​ దాడితో దెబ్బతిన్న పాక్​ ప్రతీకారదాడులకు దిగింది. వందల సంఖ్యలో డ్రోన్లు, మిసైళ్లతో భారత్​లోని సైనిక స్థావరాలపై దాడికి యత్నించింది. అయితే భారత గగనతల రక్షణ వ్యవస్థ ఎస్​–400, ఆకాశ్​ క్షిపణులు వాటిని అడ్డుకున్నాయి. అనంతరం భారత్​ ప్రతిదాడులు చేసి పాక్​లోని పలు ఎయిర్​బేస్​లను ధ్వంసం చేసింది.

    Defence Ministry | అత్యాధునిక రక్షణ వ్యవస్థ కోసం..

    శత్రు దేశాల విమానాలు, క్షిపణులు, యుద్ధ విమానాలను అడ్డుకోవడానికి భారత్(Bharath)​ ప్రస్తుతం రష్యా నుంచి కొనుగోలు చేసిన ఎస్​–400 వ్యవస్థను వినియోగిస్తుంది. రష్యా ఇప్పటికే మూడు యూనిట్లు భారత్​కు సరఫరా చేయగా మరో రెండు యూనిట్లు ఏడాదిలోగా డెలివరీ ఇవ్వనుంది. అయితే భారత్​ గగనతల రక్షణ వ్యవస్థను పటిష్టం చేసుకోవాలని భావిస్తోంది. ఇజ్రాయెల్​ ఐరన్​ డోమ్​ తరహాలో రక్షణ వ్యవస్థ ఉండాలని భావిస్తోంది. ఈ క్రమంలో ఇటీవల డ్రోన్ల నుంచి రక్షణ కోసం భార్గవాస్త్ర(Bhargavastra) పేరుతో చేపట్టిన ప్రయోగాలు విజయవంతం అయ్యాయి. దీంతో మరిన్ని పరిశోధనలు, ప్రయోగాలు, అత్యవసర ఆయుధాల కోసం రూ.50 వేల కోట్లు రక్షణ శాఖకు కేంద్రం అందించనున్నట్లు తెలిసింది.

    Latest articles

    Gold price on august 21 | త‌గ్గిన బంగారం ధ‌ర‌.. ఇంకా ల‌క్ష మార్క్ పైనే..!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Gold price on august 21 | బంగారం కొనాల‌నుకున్న వారు ఏ మాత్రం ఆల‌స్యం...

    Pre Market Analysis on August 21 | పాజిటివ్‌గా ఆసియా మార్కెట్లు.. గ్యాప్‌అప్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Pre Market Analysis on August 21 | గ్లోబల్‌ మార్కెట్లు(Global markets) ఎక్కువగా నష్టాలతో...

    Rusks | రస్క్‌లు తింటున్నారా? జాగ్రత్త.. ఈ ప్రమాదాలు తప్పవు!

    అక్షరటుడే, హైదరాబాద్ : Rusks | ఉదయం టీతో పాటు రస్క్‌లు తినడం మనలో చాలామందికి ఒక అలవాటు....

    August 21 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    August 21 Panchangam : తేదీ (DATE) – 21 ఆగస్టు​ 2025 శ్రీ విశ్వావసు నామ సంవత్సరం (Sri Vishwa...

    More like this