అక్షరటుడే, బాన్సువాడ : Sand mining | ఇసుకాసురులు రెచ్చిపోతున్నారు. రాత్రయిందంటే మంజీర నదిని తోడేస్తున్నారు. టిప్పర్లలో (tippers) నిత్యం అక్రమంగా ఇసుక తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. అయినా సంబంధిత అధికారులు అటువైపు కన్నెత్తి చూడటం లేదు. మంజీర నది నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తే కేసులు నమోదు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. అయినా కొందరు యథేచ్ఛగా ఇసుక దందా కొనసాగిస్తున్నారు. రాత్రి కాగానే లారీలు, టిప్పర్లలో హైదరాబాద్‌తో పాటు ఇతర రాష్ట్రాలకు ఇసుక రవాణా చేస్తున్నారు.
Sand mining | అనుమతులు లేకుండానే..
బీర్కూరు శివారులోని మంజీర నది (majeera river) నుంచి నిత్యం అర్ధరాత్రి టిప్పర్లలో ఇసుక తరలిపోతోంది. మంజీర తీర ప్రాంతంలో అనుమతులు లేకుండా ఇసుకను తరలించవద్దని జిల్లాస్థాయి అధికారులు (district level officers) ఆదేశాలు జారీ చేశారు. అయినా ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే ఇసుక దందా (sand mining) కొనసాగిస్తున్నారు. అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నా.. మండలస్థాయి అధికారులు, పోలీసులు (mandal level officials and police) ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు.
Sand mining | ఎక్కడ చూసినా ఇసుక డంప్‌లే..
బీర్కూర్ మంజీర (Birkur Manjeera) తీరంలో ఎక్కడ చూసినా ఇసుక డంపులే దర్శనమిస్తున్నాయి. అనువుగా ఉన్న ప్రాంతాలను ఎంపిక చేసుకుని దంపులు ఏర్పాటు చేసి అక్కడి నుంచి ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారు. లారీలు, టిప్పర్లు (lorrys and tippers) నదిలోకి దిగే అవకాశం లేకపోవడంతో అక్రమార్కులు ఒడ్డున ఇసుక డంపులను ఏర్పాటు చేసి అక్కడి నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా దూర ప్రాంతాలకు తరలిస్తున్నారు. అధికారులు, పోలీసులు అప్పుడప్పుడు ఇసుక ట్రాక్టర్లు (sand tractor) పట్టుకుంటున్నా.. లారీలు, టిప్పర్ల జోలికి వెళ్లడం లేదనే ఆరోపణలు ఉన్నాయి.