Fugitive merchant
Nizamabad | రూ.81 కోట్లకు ఐపీ పెట్టిన వ్యాపారి.. లబోదిబోమంటున్న బాధితులు

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nizamabad | నగరంలోని ఓ బడా వ్యాపారి రూ.81 కోట్లకు ఐపీ IP పెట్టి పెట్టినట్లు తెలిసింది. దీంతో ఆయన బాధితులు లబోదిబోమంటున్నారు. నిజామాబాద్​ రూరల్ nizambad rural​ శివారులోని పాల్దా గ్రామంలో palda village ఓ వ్యాపారి ప్లాస్టిక్​ బ్యాగ్స్ plastic bags​ ఫ్యాక్టరీ నిర్వహిస్తున్నాడు. అయితే ఆయన పలు బ్యాంకులు, సంస్థలతో పాటు పలువురు వ్యాపారుల నుంచి భారీ మొత్తంలో అప్పు తీసుకున్నాడు. ఈ క్రమంలో రూ.81 కోట్లకు ఐపీ పెట్టినట్లు తెలుస్తోంది. దీంతో ఆయనకు అప్పు ఇచ్చిన వారు ఆందోళన చెందుతున్నారు. శ్రద్ధానంద్​ గంజ్​ sraddanand లో వ్యాపారాలు నిర్వహించే పలువురు వర్తకులు సైతం సదరు వ్యాపారికి పెద్ద మొత్తంలో అప్పు ఇచ్చినట్లు తెలుస్తోంది. సదరు వ్యాపారి భారీ మొత్తంలో ఐపీ పెట్టినట్లు ప్రచారం కావడంతో ఆయనకు అప్పులు ఇచ్చిన వారు ఆందోళన చెందుతున్నారు.

Nizamabad | అంతా షాకింగ్​

మొన్నటి వరకు పెద్ద మొత్తంలో వ్యాపార లావాదేవీలు జరిపిన సదరు నిర్వాహకుడు ఉన్నపళంగా ఐపీ పెట్టడం చర్చకు దారి తీసింది. మరోవైపు రూ.లక్షలు, రూ.కోట్లలో అప్పులు ఇచ్చిన వారు షాక్​కు గురవుతున్నారు. బడా వ్యాపారి కావడంతో పలువురు ఎలాంటి పూచీకత్తు లేకుండానే పెద్ద మొత్తంలో అప్పు ఇచ్చారు. అయితే బ్యాంకుల నుంచి తీసుకున్న అప్పులకు పూచీకత్తు ఉంటుంది కాబట్టి వారికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ ప్రైవేట్​ వ్యక్తులు తమ పరిస్థితి ఏమిటని లబోదిబోమంటున్నారు. ఈ విషయమై పలువురు బాధితులు పోలీసులను ఆశ్రయించనున్నట్లు తెలుస్తోంది.

Nizamabad | వరుస ఘటనలు

ఉమ్మడి జిల్లాలో ఆరు నెలల కాలంలోనే దాదాపు పది మంది వ్యాపారులు అప్పులు చేసి పరారయ్యారు. ఆర్మూర్​లో బంగారం విక్రయించే ఓ వ్యక్తి చెప్ప పెట్టకుండా ఎటో వెళ్లిపోయాడు. దీంతో ఆయనకు బంగారం కోసం రూ.లక్షల డబ్బు ఇచ్చిన బాధితులు ఆందోళన చెందుతున్నారు. కామారెడ్డిలో సైతం ఓ వ్యాపారి ఐపీ పెట్టి పరరయ్యాడు. డిచ్​పల్లికి ఓ ప్రముఖ వ్యాపారి సైతం దాదాపు రూ.కోటి ఐపీ పెట్టాడు. ఇలాంటి ఘటనలు తరచూ చోటు చేసుకుంటున్నాయి. పెద్ద పెద్ద వ్యాపారులను నమ్మి చాలా మంది మధ్య తరగతి వారు సైతం వారికి అప్పులు ఇస్తారు. అయితే వారు ఇలా ఐపీలు పెట్టి వెళ్లిపోతుండడంతో అప్పులు ఇచ్చిన వారు ఆందోళన చెందుతున్నారు. ఆరు నెలల కాలంలో పలువురు వ్యాపారులు దాదాపు రూ.100 కోట్లతో పరారు కాగా తాజాగా ఒకటే వ్యాపారి రూ.81 కోట్లు ఐపీ పెట్టడం గమనార్హం.