ePaper
More
    Homeఆంధ్రప్రదేశ్​Vallabhaneni Vamshi | వ‌ల్ల‌భ‌నేని వంశీకి తీర‌ని క‌ష్టాలు.. వెంటాడుతున్న ప‌లు కేసులు

    Vallabhaneni Vamshi | వ‌ల్ల‌భ‌నేని వంశీకి తీర‌ని క‌ష్టాలు.. వెంటాడుతున్న ప‌లు కేసులు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :Vallabhaneni Vamshi | గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పరిస్థితి దారుణంగా తయారైంది. ఆయ‌న‌ని వరుస కేసులు వెంటాడుతున్నాయి. ఒక కేసులో ఊరట లభించి బెయిల్ మంజూరైనా, మరో కేసులో పీటీ వారెంట్ PT Warrant దాఖలు కావడంతో ఆయన గత 95 రోజులుగా జైలుకే పరిమితం కావాల్సిన పరిస్థితి ఏర్ప‌డింది. గన్నవరంలో 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ(Telugu Desham Party) తరఫున గెలుపొందిన వంశీ.. ఆ తర్వాత కొద్ది నెలలకే వైసీపీ(YCP)లో చేరారు. ఆయన సన్నిహితుడు అయిన కొడాలి నాని ప్రమేయంతో వైసీపీలోకి వెళ్లారు. అయితే 2019 ఎన్నికల సమయంలో వంశీ ప్రభుత్వం అనుమతి లేకుండా, ఎమ్మార్వో ఇతర రెవెన్యూ అధికారులకు కూడా తెలియకుండా నకిలీ ఇళ్ల పట్టాలను పంపిణీ చేసి.. ఓటర్లను ప్రభావితం చేశారంటూ కేసు న‌మోదైంది.

    Vallabhaneni Vamshi | కేసుల మీద కేసులు..

    అయితే వైసీపీ అధికారంలో ఉండడంతో ఈ కేసులో వంశీ vallabaneni vamshi పాత్ర లేదని పోలీసులు కోర్టుకు తెలిపారు. కానీ కేసు మాత్రం క్లోజ్ చేయలేదు. అయితే టీడీపీ నేత యార్లగడ్డ వెంకట్రావు తిరిగి టీడీపీలో చేరడంతో పరిస్థితులు మారాయి. నకిలీ ఇళ్ల పట్టాల వ్యవహారంలో వంశీ పాత్ర ఉందని నిర్ధారించిన పోలీసులు, తాజాగా ఆయన పేరును ఎఫ్ఐఆర్‌లో చేర్చారు. ఈ కేసుకు సంబంధించి బాపులపాడులో హనుమాన్ జంక్షన్ పోలీసులు నూజివీడు కోర్టు(Nuzividu Court)లో పీటీ వారెంట్ దాఖలు చేశారు. ఈ వారెంట్‌పై శుక్రవారం విచారణ జరిగి, వంశీని కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది.

    ఇప్పటికే సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో అరెస్టయి విజయవాడ జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న వంశీపై, గన్నవరంలోని టీడీపీ కార్యాలయంపై దాడి TDP Office, విధ్వంసం కేసుతో పాటు, ఒక ప్రైవేటు స్థలం ఆక్రమణకు సంబంధించిన వ్యవహారాల్లోనూ పీటీ వారెంట్లు దాఖలయ్యాయి. గన్నవరంలో అక్రమ మట్టి తవ్వకాలకు సంబంధించి వంశీపై మరో కేసు చుట్టుకునేలా ఉంది. ఈ వ్యవహారంపై విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం జరిపిన విచారణలో అనేక అక్రమాలు జరిగినట్లు తేలింది. మైనింగ్‌తో పాటు ఇతర శాఖల ప్రమేయం కూడా ఈ అక్రమాల్లో ఉన్నట్లు గుర్తించడంతో, ఈ కేసును ప్రభుత్వం అవినీతి నిరోధక శాఖ (ఏబీసీ) విచారణకు ఆదేశించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఇది జ‌రిగిందంటే వంశీపై మ‌రో కేసు న‌మోదు అవుతుంది. దీంతో ఆయ‌న మరి కొన్ని రోజులు జైలు కూడు తిన‌క త‌ప్ప‌దు

    More like this

    Nepal Govt | నేపాల్‌లో తాత్కాలిక ప్రభుత్వం..? మాజీ సీజే సుశీలా కార్కీని నియమించాలని జెన్ జడ్ పట్టు

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Nepal Govt | రెండ్రోజులుగా నిరసనలు, అల్లర్లతో అట్టుడికి పోయిన నేపాల్(Nepal)లో ఇప్పుడిప్పుడి శాంతియుత పరిస్థితులు...

    Diabetes | షుగర్ వ్యాధి పట్ల జాగ్రత్తలు పాటించాలి

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Diabetes | షుగర్ వ్యాధి (Diabetes) పట్ల పలు జాగ్రత్తలు పాటిస్తే ఈ వ్యాధిని...

    Care Degree College | 12న కేర్ డిగ్రీ కళాశాలలో రిక్రూట్​మెంట్ డ్రైవ్

    అక్షరటుడే, ఇందూరు: Care Degree College | నగరంలోని కేర్ డిగ్రీ కళాశాలలో ఈనెల 12న రిక్రూట్ మెంట్...