అక్షరటుడే, వెబ్‌డెస్క్ :Tim David | భారత్-పాక్(India-Pakistan) మధ్య ఏర్పడ్డ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఐపీఎల్‌ని IPL 2025 వారం రోజుల పాటు వాయిదా వేసిన విషయం తెలిసిందే. ఐపీఎల్ 2025 టోర్నీ మే 17 నుండి పునఃప్రారంభం అవుతోంది. పునఃప్రారంభంలో మొదటి మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB), కోల్ కతా నైట్ రైడర్స్ (KKR)జట్లు తలపడనున్నాయి. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్ జరగనుండగా, మే 17న బెంగళూరులో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ(Meteorological Department) హెచ్చరించింది. దీంతో అభిమానుల్లో ఆందోళన నెలకొంది. అయితే వారం గ్యాప్ రావడంతో విదేశీయులు తమ సొంత ప్రాంతాలకి వెళ్లారు. ఇక రేపటి నుండి మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో ఆటగాళ్లు ఒక్కొక్కరుగా భారత్‌కు వస్తున్నారు.
Tim David | స్విమ్ డేవిడ్..
ఇప్పటికే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు Royal challengers bangalore చెందిన ఆటగాళ్లు అందరూ జట్టులో చేరిపోయారు. విదేశీ ఆటగాళ్లు సైతం వచ్చేశారు. ప్రాక్టీస్ చేసుకునేందుకు గురువారం చిన్నస్వామి స్టేడియానికి ఆర్‌సీబీ ఆటగాళ్లు వెళ్లారు. అయితే.. ప్రాక్టీస్ చేస్తుండగా వర్షం మొదలైంది. దీంతో ప్రాక్టీస్‌కు అంతరాయం ఏర్పడింది. ఆటగాళ్లు డ్రెస్సింగ్ రూమ్‌లోకి వెళ్లగా, గ్రౌండ్ సిబ్బంది పిచ్‌లు తడవకుండా ఉండేందుకు కవర్లు కప్పారు. ఆ కవర్ల పై పెద్ద మొత్తంలో నీళ్లు నిలిచాయి. కాగా.. ఆస్ట్రేలియా ఆటగాడు టిమ్ డేవిడ్(Tim David) మాత్రం బట్టలు విప్పేసి చిన్నపిల్లాడిలా వర్షంలో తడిశాడు. కవర్లపై ఉన్న నీళ్లను స్విమ్మింగ్ పూల్‌గా భావించి ఏంచక్కగా డైవింగ్ చేసినట్లుగా చేశాడు.
ఇందుకు సంబంధించిన వీడియోను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(Royal Challengers Bangalore తమ సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది. ‘టిమ్ డేవిడ్ కాదు.. స్విమ్ డేవిడ్ Swim David. వర్షం డేవిడ్ స్పిరిట్‌ను ఏ మాత్రం అడ్డుకోలేకపోయింది.’ అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు(Netizens) తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.ఇక వర్షం కారణంగా మ్యాచ్ రద్దయితే ఆర్సీబీ అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే, ఈ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయితే రెండు జట్లు ఒక్కో పాయింట్ పంచుకుంటాయి. దీంతో ఆర్సీబీ 17 పాయింట్లతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంటుంది. ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించిన మొదటి జట్టుగా నిలుస్తుంది.