- Advertisement -
HomeUncategorizedCease Fire | కాల్పుల విర‌మ‌ణ మే 18 వ‌ర‌కే.. శాంతి కోసం చ‌ర్చ‌ల‌కు సిద్ధం...

Cease Fire | కాల్పుల విర‌మ‌ణ మే 18 వ‌ర‌కే.. శాంతి కోసం చ‌ర్చ‌ల‌కు సిద్ధం అంటున్న పాక్ ప్ర‌ధాని

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ :Cease Fire |ఆప‌రేష‌న్ సిందూర్ త‌ర్వాత పాకిస్తాన్ Pakistan దాడులు మ‌రింత పెంచింది. అయితే వాట‌న్నింటిని భ‌ద్ర‌తా ద‌ళాలు స‌మ‌ర్ధ‌వంతంగా తిప్పి కొట్టాయి.భారత్, పాకిస్తాన్‌ల మధ్య యుద్ధం ముగిసి ఐదు రోజులు అవుతోంది. మే 10వ తేదీన రెండు దేశాలు కాల్పుల విరమణ ఒప్పందం చేసుకోగా, మే 14వ తేదీన రెండు దేశాలకు చెందిన డీజీఎంఓ(DGMO)లు కాల్పుల విరమణ గురించి చర్చించుకున్నారు. అయితే.. రెండు దేశాల మధ్య జరిగిన కాల్పుల విరమణ ఒప్పందం మే 18వ తేదీ వరకు మాత్రమే వర్తిస్తుందని పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఐషక్ దార్(Pakistan Foreign Minister Ishaq Dar) సంచలన కామెంట్లు చేశారు.

Cease Fire | చ‌ర్చ‌ల‌కు సిద్ధం..

కొద్ది రోజుల క్రితం కొద్ది రోజుల క్రితం ఐషక్ దార్ అంతర్జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. ‘ సింధూ జలాల(Indus Waters) వివాదాన్ని పరిష్కరించకుంటే అది కాల్పుల విరమణ ఒప్పందాన్ని ప్రభావితం చేస్తుంది. ఒకరకంగా అది యుద్ధానికి కాలు దువ్వటమే అవుతుంది’ అని అన్నారు. అయితే భారత్‌తో India సంబంధాల్లో కీలక మలుపుగా, పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్(Pakistan PM Shehbaz Sharif) ఒక కీలక ప్రకటన చేశారు. భారత్‌తో ఉన్నత స్థాయి చర్చలకు తాను సిద్ధమని, అవసరమైతే ప్రధాని నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi)తో కూడా చర్చలు జరిపేందుకు వెనుకాడనని తెలిపారు. శాంతి స్థాప‌న కోసం భార‌త్‌తో చ‌ర్చ‌లు నిర్వ‌హిస్తామ‌న్నారు. ఆ దేశంలోని పంజాబ్ ప్రావిన్సులో ఉన్న క‌మ్రా ఎయిర్ బేస్‌ను విజిట్ చేసిన త‌ర్వాత మాట్లాడిన ఆయ‌న‌..అక్క‌డ ఉన్న సైనికులు, మిలిట‌రీ ఆఫీస‌ర్ల‌ను క‌లిశారు. శాంతి స్థాప‌న కోసం పాకిస్థాన్ సిద్ధంగా ఉన్న‌ట్లు ఆయ‌న చెప్పారు.

- Advertisement -

గతంలో పలు ఘర్షణలు, ఉద్రిక్తతల కారణంగా భారత–పాకిస్తాన్ సంబంధాలు మరింత దూరంగా వెళ్లిన సంగతి తెలిసిందే.ఇప్పుడు పాకిస్తాన్ Pakistan ప్రధాని తరఫున వచ్చిన ఈ ప్రకటనతో, రెండు దేశాల మధ్య మళ్లీ సంభాషణలు ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తోంది. అయితే ఈ ప్రకటనపై భారత్(Bharath) ఎలా స్పందిస్తుందన్నది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. ఇది జ‌రిగితే భారత–పాకిస్థాన్ సరిహద్దుల్లో శాంతిని స్థాపించే చర్యలకు ఇది ఒక మంచి ఆరంభమవుతుందని అంతర్జాతీయ రాజకీయవేత్తలు త‌మ అభిప్రాయం వ్య‌క్తం చేస్తున్నారు.

- Advertisement -
- Advertisement -
Must Read
Related News