Samantha
Heroine Samantha | రాజ్- స‌మంత రిలేష‌న్‌పై క్లారిటీ..కొత్త ఇంటి కోసం వెతుకులాట‌..!

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Samantha | సోష‌ల్ మీడియా(Social Media)లో జ‌రిగే కొన్ని ప్ర‌చారాల‌లో నిజం ఉంటుంది, మ‌రి కొన్ని మాత్రం పుకార్లుగానే మిగిలిపోతాయి. అయితే కొద్ది రోజులుగా స్టార్ హీరోయిన్ సమంత(Star Heroine Samantha) రూత్ ప్రభు, ‘ఫ్యామిలీ మ్యాన్‌’ డైరెక్టర్ రాజ్‌ నిడిమోరు రిలేష‌న్ గురించి నెట్టింట ఎలాంటి ప్ర‌చారాలు సాగుతున్నాయో మ‌నం చూస్తూనే ఉన్నాం. రెగ్యులర్​గా కలిసి కనిపించడం, ‘శుభం’ సినిమా సెట్స్​లో తరచుగా మీట్ అవుతుండడం ఈ పుకార్లకు మరింత ఊతం ఇచ్చింది. ఇదే స‌మయంలో రాజ్‌ Raj భార్య ఇన్‌స్టాలో పెట్టిన ఓ పోస్ట్ వైరల్ అవుతోంది. ‘శుభం’ సినిమా మంచి విజయం సాధించిందంటూ తెలిపిన స‌మంత‌ రాజ్‌ నిడిమోరు, చిత్ర బృందంతో కలిసి దిగిన ఫొటోలను సామ్ పంచుకుంది. అందులో విమానంలో రాజ్ భుజంపై సమంత తల ఆనించి కూర్చున్నట్లు ఓ సెల్ఫీ కూడా ఉంది. దీంతో వీరిద్దరూ రిలేషన్‌లో ఉన్నారని సోషల్ మీడియా కోడై కూయ‌డంతో రాజ్ స‌తీమ‌ణి ఇన్‌స్టాలో ఓ పోస్ట్ పెట్టింది.

Samantha | బిగ్ స్టెప్..

”నా గురించి ఆలోచించేవారు. నన్ను చూసేవారు.. నాతో మాట్లాడేవారు.. నా గురించి మాట్లాడేవారు.. నా గురించి వినేవారు.. వినిపించేవారు.. నా గురించి చదివి, నా గురించి వ్రాసేవారు.. ఈ రోజు నన్ను కలిసే ప్రతి ఒక్కరికీ నేను ప్రేమ, ఆశీస్సులను పంపుతున్నా’’ అనే కొటేషన్​ను శ్యామాలి Shhyaamali తన స్టోరీలో పోస్ట్ చేసింది. ఇక్కడ ఆమె ఎవరినీ ట్యాగ్ చేయలేదు.. ఎవరి పేరునూ ప్రస్తావించలేదు. అయినప్పటికీ రాజ్‌ నిడిమోరు(Raj Nidimoru)తో సమంత ఫోటోను షేర్ చేసిన రోజే ఆ పోస్ట్ పెట్ట‌డంతో వారి రిలేష‌న్‌కి సంబంధించిన‌దే అని అంద‌రు ముచ్చ‌టించుకుంటున్నారు. మ‌రోవైపు ఈ ఇద్ద‌రు త్వ‌ర‌లో బిగ్‌స్టెప్ తీసుకోబోతున్నార‌ని, ఇద్ద‌రు క‌లిసి ఉండ‌డానికి కావాల్సిన ప్రాప‌ర్టీని ప్ర‌స్తుతం వెతికే వేట‌లో ప‌డ్డారని టాక్ న‌డుస్తోంది.

ఇప్ప‌టికే రాజ్ నిడిమోరు 2022లో భార్య శ్యామాలితో విడాకులు తీసుకున్నాడ‌ని, వీరిద్ద‌రికి ఎలాంటి సంతానం లేద‌ని, వీరికి పాప ఉంద‌న్న ప్ర‌చారంలో నిజం లేద‌ని అంటున్నారు. కాగా, రాజ్ & డీకే తెరకెక్కించిన ‘ది ఫ్యామిలీమ్యాన్‌ సీజన్‌ 2’ Family man వెబ్ సిరీస్​తో సమంత ఓటీటీలో ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ‘సిటాడెల్‌: హనీ బన్నీ’ సిరీస్ లోనూ సామ్ ఫీమేల్ లీడ్ రోల్ ప్లే చేసింది. ప్రస్తుతం రాజ్‌- డీకే సంయుక్తంగా రూపొందిస్తున్న ‘రక్త బ్రహ్మాండ్: ది బ్లడీ కింగ్డమ్’లోనూ సమంత నటిస్తోంది. ఇలా క‌లిసి ప‌ని చేస్తున్న క్ర‌మంలో ఇద్ద‌రి మధ్య బాండింగ్ ఏర్ప‌డి అది ప్రేమ‌గా మారింద‌ని ప్రచారం సాగుతోంది.