- Advertisement -
HomeతెలంగాణKaleshwaram | రేపు హైదరాబాద్‌కు కాళేశ్వరం కమిషన్‌ ఛైర్మన్​

Kaleshwaram | రేపు హైదరాబాద్‌కు కాళేశ్వరం కమిషన్‌ ఛైర్మన్​

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: Kaleshwaram | కాళేశ్వరం కమిషన్ Kaleshwaram Commission​ ఛైర్మన్​ జస్టిస్‌ పీసీ ఘోష్‌ Justice PC Ghosh బుధవారం హైదరాబాద్ Hyderabad​ రానున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిన విషయమై విచారణ తుది దశకు చేరింది. ఇప్పటికే పలువురు అధికారులను కమిషన్​ విచారించింది. ఈ దఫా పలువురు రాజకీయ నేతలకు నోటీసులిచ్చి విచారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన వారికి, ఇరిగేషన్​ శాఖ మంత్రికి నోటీసులు వాంగ్మూలం రికార్డు చేయనున్నట్లు సమాచారం.గతంలో కాళేశ్వరం ఈఎన్​సీలను విచారించిన కమిషన్​ నివేదిక రూపొందించింది. తుది దశ విచారణ అనంతరం ప్రభుత్వానికి సమగ్ర నివేదిక సమర్పించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఓ వైపు బీఆర్​ఎస్​ వరంగల్​లో రజోత్సవ సభను ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తోంది. ఈ క్రమంలో ప్రముఖ నాయకులను కమిషన్​ విచారణకు పిలవనున్నట్లు తెలిసింది.

- Advertisement -
- Advertisement -
Must Read
Related News