Kamareddy SP
Kamareddy SP | అసాంఘిక కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకోవాలి

అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy SP | గంజాయి, మట్కా, జూదం.. వంటి అసాంఘిక కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్పీ రాజేష్ చంద్ర (SP rajesh chandra) పోలీసు అధికారులను ఆదేశించారు. గురువారం తన కార్యాలయంలో పోలీస్ అధికారులతో (police officers) నెలవారీ నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. పెండింగ్ కేసులపై (pending cases) అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రతి కేసులో వేగవంతమైన దర్యాప్తు జరగాలని, బాధితులకు సత్వర న్యాయం అందాలన్నారు. సైబర్ మోసాలపై (cyber frauds) ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ప్రతి స్టేషన్ పరిధిలో సీసీ కెమెరాలు (CC cameras) పెంచాలని, రోడ్డు ప్రమాదాలు జరిగే బ్లాక్ స్పాట్స్ గుర్తించి నివారణ చర్యలు చేపట్టాలన్నారు. సమావేశంలో అడిషనల్ ఎస్పీ నరసింహారెడ్డి, ఏఎస్పీ చైతన్య రెడ్డి, డీఎస్పీలు, సీఐలు, ఎస్ హెచ్ ఓలు, సిబ్బంది పాల్గొన్నారు.