ePaper
More
    HomeజాతీయంED raids | నోట్ల గుట్ట‌లు.. కిలోల కొద్దీ బంగారం.. ఈడీ త‌నిఖీల్లో బ‌ట్ట‌బ‌య‌లు

    ED raids | నోట్ల గుట్ట‌లు.. కిలోల కొద్దీ బంగారం.. ఈడీ త‌నిఖీల్లో బ‌ట్ట‌బ‌య‌లు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: ED raids | నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా భారీగా అక్ర‌మాల‌కు పాల్ప‌డుతున్న సిండికేట్ గుట్టును ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ (enforcement directorate) రట్టు చేసింది. ఏక‌కాలంలో నిర్వ‌హించిన త‌నిఖీల్లో నోట్ల గుట్ట‌లు, కిలోల కొద్దీ బంగారం బ‌య‌ట‌ప‌డింది. అతిపెద్ద మనీలాండ‌రింగ్‌లో (money laundering) భాగస్వాములైన వారిపై క‌న్నేసిన ఈడీ వారి ఆట క‌ట్టించింది. వాసాయి-విరార్ మున్సిపల్ కార్పొరేషన్ (Vasai-Virar Municipal Corporation) పరిధిలోని 13 ప్రదేశాలలో సోదాలు నిర్వహించింది. ఇందులో ప్ర‌ధానంగా హైద‌రాబాద్‌కు (hyderabad) చెందిన టౌన్ ప్లానింగ్ అధికారి వైఎస్ రెడ్డి (town planing officer YS reddy) నివాసంలో దాడి చేయ‌గా, భారీగా న‌గ‌దు, బంగారం బ‌య‌ట‌ప‌డ్డాయి. మ‌హారాష్ట్రలోని వాసాయి విరార్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్‌లో టౌన్‌ప్లానింగ్ డిప్యూటీ డైరెక్ట‌ర్‌గా (deputy director) ప‌ని చేస్తున్నారు. 41 భ‌వ‌నాల‌కు అక్ర‌మంగా అనుమ‌తులు ఇచ్చిన ఆయ‌న భారీగా దండుకుంటున్న‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి.

    ED raids | రూ.9 కోట్ల న‌గ‌దు..

    ఈ నేప‌థ్యంలోనే మురుగునీటి శుద్ధి, డంపింగ్ గ్రౌండ్‌ల (dumping grounds) కోసం రిజర్వు చేసిన దాదాపు 60 ఎకరాల ప్ర‌భుత్వ భూమిలో 41 మ‌ల్టీ ప‌ర్ప‌స్ బిల్డింగ్స్ డెవ‌ల‌ప్‌మెంట్‌లో (buildings development) పాల్గొన్న‌ట్లు ఆరోప‌ణ‌ల‌ను ఎదుర్కొంటున్న సిండికేట్‌ను ఈడీ (ED) ల‌క్ష్యంగా చేసుకుంది. ఇందులో భాగంగా వైఎస్ రెడ్డి నివాసంపై గురువారం దాడి చేసింది. త‌నిఖీల్లో భాగంగా భారీగా న‌గ‌దు, బంగారం, వ‌జ్రాలు దొరికాయి. గుట్ట‌ల కొద్దీ నోట్ల క‌ట్ట‌లు ల‌భ్యం కావ‌డంతో అధికారుల క‌ళ్లు బైర్లు క‌మ్మాయి. ఏకంగా రూ.9 కోట్ల న‌గ‌దు ల‌భ్య‌మైంది. అలాగే రూ.23 కోట్ల విలువైన బంగారం వ‌జ్రాలను స్వాధీనం చేసుకున్నారు.

    ED raids | రెడ్డి మ‌హా ముదురే..

    వైఎస్ రెడ్డిపై గ‌తంలో అనేక అవినీతి ఆరోప‌ణ‌లున్నాయి. ఏకంగా కార్పొరేట‌ర్‌కే లంచం ఇచ్చిన చ‌రిత్ర ఆయ‌న సొంతం. త‌న‌పై కోర్టులో (court) వేసిన కేసును విత్‌డ్రా (case withdraw) చేసుకునేందుకు 2016లో అప్ప‌టి శివ‌సేన కార్పొరేట‌ర్ ధ‌నుంజ‌య‌కు రూ.25 ల‌క్ష‌ల లంచం ఇవ్వ‌డానికి ప్ర‌య‌త్నించారు. ఆ స‌మ‌యంలో ఏసీబీ అధికారులు (ACB officals) ఆయ‌నను రెడ్‌హ్యాండెడ్‌గా ప‌ట్టుకున్నారు.

    ED raids | నిరాశ్ర‌యులైన 2500 కుటుంబాలు

    అధికారులు, వ్యాపారులు, పొలిటిక‌ల్ లీడ‌ర్లు క‌లిసి సిండికేట్‌గా మారి పేద‌ల‌ను నిండా ముంచారు. వాసాయికి చెందిన బిల్డర్ అరుణ్ గుప్తా, VVMC అధికారులు, డాక్యుమెంట్ తయారీదారులు న‌కిలీ ప‌త్రాలు (fake documents), అక్ర‌మ అనుమ‌తులు పొంది అమాయ‌కుల‌కు అంట‌గ‌ట్టారు. 2010- 2012 మధ్య నిర్మించిన భవనాలు జోనింగ్, భూ వినియోగ నిబంధనలను స్పష్టంగా ఉల్లంఘించారని ఆరోపణలున్నాయి. వీటిని బాంబే హైకోర్టు (bombay high court) ఆదేశాల మేరకు డిసెంబర్ 2024లో కూల్చివేశారు. వాసాయి-విరార్ మున్సిపల్ కార్పొరేషన్ (Vasai-Virar Municipal Corporation) నిర్వహించిన కూల్చివేత డ్రైవ్‌లో 2,500 మందికి పైగా కుటుంబాలు నిరాశ్రయులయ్యాయి. అయితే, దీని వెనుక జ‌రిగిన అతిపెద్ద మనీలాండరింగ్ వ్య‌వ‌హారంపై ఈడీ దృష్టి సారించింది. దాదాపు రూ.వెయ్యి కోట్ల‌కు అక్ర‌మాల‌కు పాల్ప‌డిన వ్య‌క్తుల కార్యాల‌యాలు, నివాసాల్లో సోదాలు జరిపింది.

    More like this

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం తేదీ (DATE) – సెప్టెంబరు 10,​ 2025 పంచాంగం శ్రీ విశ్వావసు...

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...