అక్షరటుడే, నిజాంసాగర్: Mahammed Nagar | మహమ్మద్ నగర్ మండలంలోని బూర్గుల్ శివారులోని సాయిబాబా ఆలయానికి (Saibaba Temple) వెండి గొడుగు విరాళంగా అందజేశారు. కరీంనగర్ (Karimnagar) జిల్లా ధర్మరావుపేటకు చెందిన చెలిమెల వెంకటేశం-పద్మ దంపతులు గురువారం ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం 13 తులాల వెండి గొడుగును బహూకరించారు. ఈ సందర్భంగా ఆలయ వేద పండితులు రాజకుమార్ భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ నిర్వాహకులు విజయకుమార్, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
