ePaper
More
    HomeజాతీయంMinister Jaishankar | పీవోకేను ఖాళీ చేయాల్సిందే.. పాక్‌కు విదేశాంగ మంత్రి జైశంక‌ర్ స్ప‌ష్టీక‌ర‌ణ‌

    Minister Jaishankar | పీవోకేను ఖాళీ చేయాల్సిందే.. పాక్‌కు విదేశాంగ మంత్రి జైశంక‌ర్ స్ప‌ష్టీక‌ర‌ణ‌

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Minister Jaishankar | జ‌మ్మూకాశ్మీర్ (jammu and kashmir) భార‌త్ సొంత‌మ‌ని, ఇందులో మ‌రొక‌రి జోక్యం అంగీక‌రించ‌బోమ‌ని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎస్‌.జైశంక‌ర్ (union external affairs minister S. jaishankar) స్ప‌ష్టం చేశారు. కాశ్మీర్‌పై చర్చించడానికి మిగిలి ఉన్న ఏకైక విషయం పాకిస్తాన్ పీఓకేలోని చట్టవిరుద్ధంగా ఆక్రమించిన భారత భూభాగాన్ని ఖాళీ చేయడమేనని తేల్చి చెప్పారు. సింధు జ‌లాల (indus water) ఒప్పందం ర‌ద్దు విష‌యంలో పున‌రాలోచించాల‌న్న పాకిస్తాన్ (pakistan) విజ్ఞ‌ప్తిపై ఆయన స్పందించారు. అది పాకిస్తాన్‌పైనే ఆధార‌ప‌డి ఉంటుంద‌ని, సీమాంత‌ర ఉగ్ర‌వాదాన్ని ఎగ‌దోయ‌డం ఆపేవ‌ర‌కు త‌మ నిర్ణ‌యంలో మార్పు ఉండ‌ద‌ని తేల్చి చెప్పారు. గురువారం విలేక‌రుల‌తో మాట్లాడిన జైశంక‌ర్‌.. కశ్మీర్ సమస్యపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంలో మూడో దేశం జోక్యం అవసరం లేదని, ఇది భారత్-పాకిస్థాన్ (india-pakistan) మధ్య ద్వైపాక్షిక అంశమని స్పష్టం చేశారు. పాకిస్తాన్ సీమాంతర ఉగ్రవాదాన్ని (terrorism) విశ్వసనీయంగా, తిరిగి మార్చలేని విధంగా ముగించే వరకు సింధు జలాల ఒప్పందం నిలిపివేయబడుతుందన్నారు.

    Minister Jaishankar | పాక్‌కు భారీగా న‌ష్టం..

    సీమాంతర ఉగ్ర‌వాదాన్ని (terrorism) ఎగ‌దోస్తున్న పాకిస్తాన్‌కు భార‌త్ త‌గిన బుద్ధి చెప్పింద‌ని విదేశాంగ శాఖ మంత్రి తెలిపారు. ఆపరేషన్ సిందూర్ (operation sindoor) ద్వారా భారత సైన్యం (indian army) పాకిస్థాన్ ఉగ్రవాద (pakistan terrorists) మౌలిక సదుపాయాలను ధ్వంసం చేసినట్లు చెప్పారు. పాకిస్థాన్ సైన్యాన్ని (pakistan army) కాకుండా ఉగ్రవాద కేంద్రాలను లక్ష్యంగా చేసుకున్నామని ముందే హెచ్చరించినట్లు పేర్కొన్నారు. అయినప్పటికీ, పాకిస్థాన్ ఈ సలహాను పట్టించుకోలేదన్నారు. భారతదేశంపై చేసిన దాడికి మా సైన్యం గట్టి ప్రతీకారం తీర్చుకుందన్నారు. శాటిలైట్ చిత్రాలు పాకిస్థాన్‌కు జరిగిన భారీ నష్టాన్ని, భారతదేశానికి (india) అతి తక్కువ నష్టాన్ని స్పష్టంగా చూపిస్తున్నాయని గుర్తు చేశారు.

    Minister Jaishankar | భార‌త స‌త్తా చాటాం..

    ఆప‌రేష‌న్ సిందూర్ (operation sindoor) ద్వారా భార‌త్ స‌త్తాను ప్ర‌పంచానికి చాటి చెప్పామ‌ని జైశంక‌ర్ తెలిపారు. భార‌త సైన్యం త‌మ సామ‌ర్థ్యాన్ని ప్ర‌పంచం మొత్తానికి చూపింద‌న్నారు. పహల్గామ్ ఉగ్రదాడి (pahalgam terror attack) తర్వాత తీవ్రవాద రెసిస్టెన్స్ ఫ్రంట్ (TRF ) ఉగ్రవాద సంస్థను నిషేధించాలని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (UNSC)లో భారత్ డిమాండ్ చేసింది. ఈ సంస్థకు వ్యతిరేకంగా ఆధారాలను సమర్పించేందుకు భారత్ సిద్ధంగా ఉంద‌ని జైశంకర్ తెలిపారు. పహల్గామ్ దాడిలో (pahalgam attack) దోషులకు కఠిన శిక్ష విధించాలని ఐక్యరాజ్య సమితి సభ్యులు స్పష్టం చేశార‌న్నారు. ఈ విషయంలో భారత్‌కు అంతర్జాతీయంగా మద్దతు లభిస్తోందన్నారు.

    Minister Jaishankar | సింధు జలాల ఒప్పందం..

    భారత్ దాడి తర్వాత పాకిస్థాన్ కూడా చైనా డ్రోన్‌లను (china drones) ఉపయోగించినట్లు జైశంకర్ వ్యాఖ్యానించారు. ప్రపంచం ఈ దాడిని చూసిందని, ఆపరేషన్ సిందూర్ (operattion sindoor) తర్వాత, భారత్‌కు అంతర్జాతీయ సమాజం నుంచి మంచి మద్దతు లభిస్తుందన్నారు జై శంకర్. పహల్గామ్ దాడి తర్వాత, భారతదేశం సింధు జల (indus water) ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ నిర్ణయంపై మాట్లాడుతూ పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని శాశ్వతంగా నిలిపివేసే వరకూ ఈ ఒప్పందం నిలిపివేయబడుతుందన్నారు. ఈ క్రమంలో కశ్మీర్‌పై చర్చించాల్సిన ఒకే ఒక అంశం ఉందన్నారు. అది పాకిస్థాన్ అక్రమంగా ఆక్రమించిన భారత భూభాగాన్ని ఖాళీ చేయడం. దీని గురించి చర్చకు మేము సిద్ధంగా ఉన్నామని జైశంకర్ మరోసారి స్పష్టం చేశారు.

    Latest articles

    Medak | యథేచ్ఛగా మొరం దందా.. అడ్డుకున్న గ్రామస్తులు

    అక్షరటుడే, మెదక్​ : Medak | మొరం వ్యాపారులు రెచ్చిపోతున్నారు. ఎలాంటి అనుమతులు (Permissions) తీసుకోకుండా అక్రమంగా మొరం...

    Tirumala | ఏఐ టెక్నాల‌జీతో వేగంగా శ్రీవారి దర్శనం.. టీటీడీ ఛైర్మ‌న్ బీఆర్ నాయుడు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Tirumala | భక్తుల భాగస్వామ్యంతో స‌నాత‌న ధ‌ర్మ‌ ప్ర‌చార కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తామ‌ని టీటీడీ ఛైర్మ‌న్...

    Jeevan Reddy | తెలంగాణకు మళ్లీ చీకటి రోజులు

    అక్షర టుడే, ఆర్మూర్‌ : Jeevan Reddy | కాంగ్రెస్‌ పాలనలో తెలంగాణకు మళ్లీ చీకటి రోజులు వచ్చాయని...

    Mahammad nagar | పంద్రాగస్టు రోజు యథేచ్ఛగా మద్యం విక్రయాలు

    అక్షరటుడే, నిజాంసాగర్‌: Mahammad nagar | స్వాతంత్య్ర దినోత్సవం రోజు యథేచ్ఛగా మద్యం విక్రయాలు కొనసాగాయి. ఎక్సైజ్​శాఖ (Excise...

    More like this

    Medak | యథేచ్ఛగా మొరం దందా.. అడ్డుకున్న గ్రామస్తులు

    అక్షరటుడే, మెదక్​ : Medak | మొరం వ్యాపారులు రెచ్చిపోతున్నారు. ఎలాంటి అనుమతులు (Permissions) తీసుకోకుండా అక్రమంగా మొరం...

    Tirumala | ఏఐ టెక్నాల‌జీతో వేగంగా శ్రీవారి దర్శనం.. టీటీడీ ఛైర్మ‌న్ బీఆర్ నాయుడు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Tirumala | భక్తుల భాగస్వామ్యంతో స‌నాత‌న ధ‌ర్మ‌ ప్ర‌చార కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తామ‌ని టీటీడీ ఛైర్మ‌న్...

    Jeevan Reddy | తెలంగాణకు మళ్లీ చీకటి రోజులు

    అక్షర టుడే, ఆర్మూర్‌ : Jeevan Reddy | కాంగ్రెస్‌ పాలనలో తెలంగాణకు మళ్లీ చీకటి రోజులు వచ్చాయని...