Mla Dhanpal Surya Narayana
Mla Dhanpal Surya Narayana | గాండ్ల సంఘ అభివృద్ధికి కృషి చేస్తా

అక్షరటుడే, ఇందూరు: Mla Dhanpal Surya Narayana | పట్టణ గాండ్ల సంఘం అభివృద్ధికి తనవంతు సహకారం అందిస్తానని అర్బన్‌ ఎమ్మెల్యే ధన్‌పాల్‌ సూర్యనారాయణ గుప్తా అన్నారు. గురువారం నగరంలోని సిర్నాపల్లి గడిలో పట్టణ గాండ్ల సంఘం (Pattana Gandla Sangham) రెండో అంతస్తును నుడా ఛైర్మన్‌ కేశవేణుతో (Nuda Chairman Kesha venu) కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎస్డీఎఫ్‌ కింద రూ.5 లక్షలు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అభివృద్ధి పనులపై వివక్ష చూపుతోందన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి పార్టీలకతీతంగా కలిసి రావాలని కోరారు. కార్యక్రమంలో గాండ్ల సంఘం పట్టణాధ్యక్షుడు అశోక్, నాగరాజు పాల్గొన్నారు.