అక్షరటుడే, బాన్సువాడ: MLA Pocharam | అభివృద్ధి పనులను నాణ్యతతో చేపట్టాలని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి (MLA Pocharam Srinivas Reddy) సూచించారు. ఎక్కడైనా తేడా వస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులకు, కాంట్రాక్టర్లకు హెచ్చరించారు. వర్ని మండలం సిద్ధాపూర్ రిజర్వాయర్ (Siddapur Reservoir) పనులను, జాకోరాలో లిఫ్ట్ ఇరిగేషన్ (Jakora Lift Irrigation), సబ్ స్టేషన్ నిర్మాణ పనులను గురువారం మధ్యాహ్నం పరిశీలించారు. అధికారులు ఎప్పటికప్పుడు పనులను పర్యవేక్షణ చేయాలని సూచించారు. పనులను త్వరితగతిన పూర్తి చేస్తే రైతులకు సకాలంలో సాగునీరు అందించగలుగుతామని వెల్లడించారు. కార్యక్రమంలో ఇరిగేషన్ సీఈ శ్రీనివాస్, ఎస్సీ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.