అక్షరటుడే, ఇందూరు: Nizamabad collector | విద్యార్థులకు సులభంగా అర్థమయ్యే విధంగా బోధించేలా ఉపాధ్యాయులకు శిక్షణ తరగతులు ఉపయోగపడతామయని కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు (Collector Rajiv Gandhi Hanumanthu) అన్నారు. జిల్లా కేంద్రంలోని హెచ్‌పీఎస్‌లో కొనసాగుతున్న ట్రైనింగ్ క్లాసులను (Teachers training classes) ఆయన పరిశీలించారు. గణితం, ఆంగ్లం బోధించే ఉపాధ్యాయులకు అందిస్తున్న శిక్షణ వివరాలను అడిగి తెలుసుకున్నారు. శిక్షణను సద్వినియోగం చేసుకుని విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధన చేయాలని ఉపాధ్యాయులకు ఆయన సూచించారు. కలెక్టర్ వెంట డీఈవో అశోక్ (DEO Ashok) తదితరులు పాల్గొన్నారు.
