ePaper
More
    HomeజాతీయంHYBRID CAR | గుడ్​ న్యూస్​.. రూ.2 లక్షలకే ఎలక్ట్రిక్, డీజిల్​ హైబ్రిడ్ కారు!

    HYBRID CAR | గుడ్​ న్యూస్​.. రూ.2 లక్షలకే ఎలక్ట్రిక్, డీజిల్​ హైబ్రిడ్ కారు!

    Published on

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Hybrid Car : మధ్యప్రదేశ్‌‌(Madhya Pradesh)లోని సాగర్‌ పట్టణానికి చెందిన హిమాంశు పటేల్(Himanshu Patel) గుజరాత్‌(Gujarat)లోని గాంధీనగర్‌(Gandhinagar)లో ఉన్న ఎల్‌డీఆర్‌పీ ఇన్‌స్టిట్యూట్‌(LDRP Institute)లో ఎలక్ట్రిక్ బ్రాంచ్‌(electric branch)లో బీఈ(BE) చేస్తున్నాడు. బీఈ కోర్సు పూర్తి కాకముందే ఈ యువకుడు హైబ్రిడ్ కారు తయారు చేశాడు. ఈ వాహనం ఎలక్ట్రిక్ మోడ్‌తో పాటు డీజిల్ మోడ్‌లోనూ నడవడం దీని ప్రత్యేకత.

    Hybrid Car : కేవలం రూ.2 లక్షలతో..

    సాగర్ పట్టణం(Sagar town) పరిధిలోని మకరోనియా ఏరియాలో హిమాంశు ఉంటున్నాడు. గుజరాత్​లో చదివే ఈ యువకుడు కరోనా లాక్‌డౌన్ సమయంలో తన ఇంట్లోనే ఉండిపోయాడు. అప్పట్లో తీరిక సమయాన్ని సద్వినియోగం చేసుకొని ఈ-కారును తయారు చేశాడు. తాజాగా డీజిల్, ఎలక్ట్రిక్ రెండు రకాల మోడ్‌‌లకు సపోర్ట్ చేసే హైబ్రిడ్ కారు రూపొందించాడు. దీని తయారీకి రూ.2లక్షల వరకు ఖర్చయ్యాయని ఈ యువకుడు తెలిపాడు.

    Hybrid Car : డీజిల్ మోడ్ ఫీచర్లు

    2.6 లీటర్ల డీఐ ఇంజిన్, 4.1 గేర్ బాక్స్ అమర్చాడు. 60 లీటర్ల డీజిల్ ట్యాంక్ నిక్షిప్తం చేశాడు. లీటరు డీజిల్‌తో ఈ కారు 18 నుంచి 19 లీటర్ల మైలేజీ ఇస్తుందని హిమాంశు తెలిపాడు. ఈ కారును డీజిల్‌తో నడిపిస్తే గంటకు 110 నుంచి 120 కి.మీ వేగంలో వెళ్లవచ్చు.

    Hybrid Car : ఎలక్ట్రిక్ మోడ్ ఫీచర్లు

    సాధారణ ఎలక్ట్రిక్ కార్లు ఆటోమేటిక్‌గా పనిచేస్తాయి. కానీ, హిమాంశు కారు మాన్యువల్ గేర్లతో నడుస్తుంది. ఈ కారులోని బ్యాటరీ ఫుల్‌గా ఛార్జ్ కావడానికి 5 నుంచి 6 యూనిట్ల విద్యుత్తు అవసరం. నాలుగు నుంచి ఐదు గంటల్లోగా ఫుల్ ఛార్జ్ అవుతుంది. ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే సుమారు 180 కి.మీ దూరం నడపొచ్చు.

    Hybrid Car : మూడు విధాలుగా ఛార్జ్..

    హిమాంశు కారు బ్యాటరీని మూడు రకాలుగా ఛార్జింగ్ చేయవచ్చు. ఎలక్ట్రిక్ మోడ్‌లో డ్రైవ్ చేస్తున్నప్పుడు బ్రేక్ వేసినప్పుడల్లా ఉత్పత్తి అయ్యే శక్తి నేరుగా బ్యాటరీలో స్టోర్ కావడం ఒక విధానం. డీజిల్ మోడ్‌లో నడిపే క్రమంలో బ్రేకింగ్ సిస్టమ్ ద్వారా వెలువడే శక్తిని బ్యాటరీలో నిల్వ చేసుకోవడం రెండో విధానం. ఇంట్లో వినియోగించే కరెంటుతో బ్యాటరీని ఛార్జ్ చేసుకోవడం మూడో మూడో విధానం.

    More like this

    ACB Raids | ఏసీబీ అధికారుల దూకుడు.. పాఠశాలల్లో తనిఖీలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : ACB Raids | ఏసీబీ అధికారులు దూకుడు పెంచారు. నిత్యం దాడులు చేపడుతూ.. అవినీతి...

    Excise Department | మత్తుపదార్థాలు రవాణా చేస్తున్న ఒకరి అరెస్ట్

    అక్షరటుడే నిజామాబాద్ సిటీ: Excise Department | అల్ప్రాజోలం రవాణా చేస్తున్న ఒకరిని ఎక్సైజ్ పోలీసులు అరెస్టు చేశారు....

    Mumbai Navy Yard | నేవీ యార్డులో ఆయుధాల చోరీ.. నేవీ కానిస్టేబుల్, అతడి సోదరుడి అరెస్టు

    అక్షరటుడే, వెబ్ డెస్క్: Mumbai Navy Yard | తెలంగాణకు చెందిన నేవీ కానిస్టేబుల్ (Navy Constable) దొంగ...