ePaper
More
    Homeఅంతర్జాతీయంBOYCOTT TURKEY | తుర్కియేకు షాక్.. యూనివర్సిటీ బప్పందాన్ని రద్దు చేసిన JNU

    BOYCOTT TURKEY | తుర్కియేకు షాక్.. యూనివర్సిటీ బప్పందాన్ని రద్దు చేసిన JNU

    Published on

    అక్షరటుడే, న్యూఢిల్లీ: BOYCOTT TURKEY | పహల్​గామ్​​ ఉగ్రదాడి(Pahalgaon terror attack) తర్వాత పాకిస్తాన్​​పై భారత్ ఆపరేషన్​ సిందూర్(Operation Sindoor) చేపట్టింది. దీంతో ఇరు దేశాల నడుమ ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ సమయంలోనే పాకిస్తాన్ (Pakistan) ​కు తుర్కియే మద్దతు ఇవ్వడంపై భారతదేశంలో ​తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

    ఇప్పటికే తుర్కియేకు ఆన్‌లైన్‌ బుకింగ్‌లను నిలిపివేస్తున్నట్లు మన ట్రావెల్‌ ఏజెన్సీలు ప్రకటించాయి. ఈ క్రమంలోనే తుర్కియేలోని ఇనొను యూనివర్సిటీ(Inonu University)తో కుదుర్చుకున్న ఒప్పందాన్ని నిలిపేస్తున్నట్లు తాజాగా ఢిల్లీ(Delhi)లోని ప్రఖ్యాత జేఎన్‌యూ(JNU) ప్రకటించింది.

    దేశ భద్రత దృష్ట్యా ఇనొను యూనివర్సిటీ (Inonu University)తో కుదుర్చుకున్న ఎంవోయూను నిలిపేస్తున్నట్లు జేఎన్‌యూ సీనియర్‌ అధికారి చెప్పారు. ఈ ఒప్పందంలో అధ్యాపకులు, విద్యార్థుల మార్పిడికి సంబంధించిన ప్రణాళికలు ఉన్నాయని పేర్కొన్నారు. ఇరుదేశాల వర్సిటీల మధ్య ఇటీవల మూడేళ్ల కాల పరిమితికి విద్యాపరమైన ఒప్పందం కుదిరింది.

    తుర్కియేలోని మలట్యా(Malatya)లో ఇనొను యూనివర్సిటీ ఉంది. విభిన్న సాంస్కృతిక పరిశోధనలు, విద్యార్థుల సామర్థ్యాన్ని పెంపొందించే విధంగా ఇటీవల జేఎన్‌యూ, ఇనొను వర్సిటీల మధ్య ఎంవోయూ కుదిరింది. తాజా పరిణామాల నేపథ్యంలో సదరు ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తూ జేఎన్‌యూ నిర్ణయం తీసుకుంది.

    తుర్కియేలో కొన్నేళ్ల క్రితం భూకంపం(earthquake) వచ్చింది. ఆ సమయంలో భారత్​ తక్షణం స్పందించి, అన్నివిధాలా సాయం అందించింది. కానీ, పహల్​గామ్​ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్​కు బుద్ధి చెప్పేందుకు ఆపరేషన్‌ సిందూర్‌(Operation Sindoor)తో భారత్ దాడి చేసింది.

    కానీ, ఈ సమయంలో పాక్‌కు తుర్కియే బాంబు డ్రోనులను సరఫరా చేసింది. మిలిటరీ సిబ్బందిని కూడా పంపించింది. దీంతో ఆగ్రహించిన ప్రజలు బాయ్‌కాట్‌ తుర్కియే(Boycott turkey) పేరుతో సోషల్‌ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా తుర్కియే వస్తువులు, పర్యాటకాన్ని బహిష్కరించాలన్న డిమాండ్లు ఉన్నాయి.

    ఇప్పటికే తుర్కియే ఆన్​లైన్ బుకింగ్​లను నిలిపివేశారు. మరోవైపు మహారాష్ట్ర(Maharashtra)లోని పుణె (Pune) వ్యాపారులు తుర్కియే నుంచి వచ్చే యాపిల్స్​ను సైతం పూర్తిగా బహిష్కరించారు. తుర్కియే యాపిల్స్​ను దిగుమతి చేసుకోవడం మానేశారు. అలా పుణె మార్కెట్ యార్డు (Pune market yards) ల్లో తుర్కియే యాపిల్స్ కనుమరుగయ్యాయి. రానున్న రోజుల్లో తుర్కియేతో భారత్​ వాణిజ్య సంబంధాలు సైతం తగ్గే అవకాశాలు లేకపోలేదు.

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...