- Advertisement -
Homeబిజినెస్​RBI | ఆర్​బీఐ కీలక నిర్ణయం.. ఇక మైనర్లు బ్యాంక్​ అకౌంట్​ తెరవొచ్చు

RBI | ఆర్​బీఐ కీలక నిర్ణయం.. ఇక మైనర్లు బ్యాంక్​ అకౌంట్​ తెరవొచ్చు

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : RBI | రిజర్వ్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా RBI(Reserve bank of india) కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో మైనర్లు బ్యాంక్​ అకౌంట్ Minor bank accounts​ తెరవాలంటే తల్లిదండ్రులు, సంరక్షకుల సమక్షంలోనే తెరవాల్సి ఉండేది. ప్రస్తుతం పదేళ్లు నిండిన మైనర్లు సొంతంగానే బ్యాంక్​లో సేవింగ్స్​ savings​, రికరింగ్ recurring​ డిపాజిట్​ ఖాతాలు తెరవచ్చొని ఆర్​బీఐ స్పష్టం చేసింది.

గతంలో ఉన్న నిబంధనలు సరళతరం చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. మైనర్లు ఎవరైనా సంరక్షకుల సమక్షంలో సులువుగా బ్యాంక్​ అకౌంట్ minors bank account ​ తీసుకోవచ్చని తెలిపింది. పదేళ్లు నిండిన వారు సొంతంగా కూడా అకౌంట్​ తీసుకోవాలనుకుంటే ఇవ్వాలని బ్యాంకులను ఆదేశించింది.

- Advertisement -

పదేళ్లు నిండి సొంతంగా అకౌంట్​ తీసుకున్న వారికి అకౌంట్​బుక్​తో పాటు, ఏటీఎం ATM, ఇంటర్​నెట్​ బ్యాంకింగ్ Internet Banking​ వంటి సౌకర్యాలు వారు అడిగితే కల్పించాలని ఆదేశించింది. అలాగే మైనర్ల అకౌంట్​ బ్యాలెన్స్​ నెగెటివ్​లోకి వెళ్లకుండా చూడాలని పేర్కొంది. మైనర్​ అకౌంట్​ తీసుకున్న వారు 18 ఏళ్లు నిండితే వారి కేవైసీ kyc update పూర్తి చేసి కొత్తగా సంతకాలు తీసుకోవాలని ఆదేశించింది. అన్ని బ్యాంకులు ఈ రూల్స్​ను పాటించాలని పేర్కొంది. ఈ నిబంధనలు జూలై 1 నుంచి అమలులోకి వస్తాయని, అప్పటిలోగా బ్యాంకులు తమ పాలసీలలో మార్పులు చేసుకోవాలని ఆర్​బీఐ సూచించింది.

- Advertisement -
- Advertisement -
Must Read
Related News