అక్షరటుడే, వెబ్‌డెస్క్: jagadeka veerudu athiloka sundari | ఈ మధ్య టాలీవుడ్‌లో రీలీజ్‌ల ట్రెండ్ ఎక్కువైంది. స్టార్ హీరోల సినిమాలని బర్త్ డే రోజు లేదంటే ఓ అకేషన్‌లో రిలీజ్ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. అయితే అన్ని సినిమాలు ప్రేక్షకుల్ని థియేటర్లకు రప్పించలేకపోతున్నాయి. భారీ అంచనాలతో రీ-రిలీజ్ (re-released) అయిన కొన్ని సినిమాలు ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేక నిర్మాతలను నిరాశపరిచాయి. ఫాంటసీ జానర్లో తెలుగులో క్లాసిక్ హిట్‌గా నిలిచిన జగదేక వీరుడు అతిలోక సుందరి (jagadeka veerudu athiloka sundari) (జేవీఏఎస్) కొద్ది రోజుల క్రితం రీరిలీజ్ కాగా, తొలి రోజు ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర పెద్ద హిట్ అయింది. కె.రాఘవేంద్రరావు (k.raghavendra rao) దర్శకత్వంలో చిరంజీవి, శ్రీదేవి (chiranjeevi and sridevi) నటించిన ఈ సినిమా 1990లో విడుదలై భారీ విజయం సాధించింది.
వైజయంతి మూవీస్ బ్యానర్‌పై (vyjayanthi movies baner) సి.అశ్వినీదత్ ఈ సినిమాను నిర్మించగా, ఈ చిత్రం 1990లో రూ.2 కోట్ల బడ్జెట్‌తో రూపొందింది. రీ-రిలీజ్‌కు అసలు బడ్జెట్ కంటే ఎక్కువ ఖర్చయ్యిందని అశ్వినీదత్ చెప్పారు. రీ-రిలీజ్‌కు రూ.9 కోట్లు ఖర్చయ్యింది. తెలుగు ప్రేక్షకులకు (telugu audience) బాగా తెలిసిన ఈ సినిమా రీ-రిలీజ్‌కు మొదటి రోజు మంచి స్పందన వచ్చింది. రూ.కోటిన్నర వసూలు చేసింది. కానీ తర్వాతి రోజుల్లో కలెక్షన్లు తగ్గాయి. ఐదో రోజు కేవలం రూ.20 లక్షలు మాత్రమే వసూలైంది. ఐదు రోజుల్లో సినిమా రూ.2.84 కోట్లు వసూలు చేసిందని అంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో (telugu states) రూ.2.3 కోట్లు, ఇతర రాష్ట్రాల్లో రూ.54 లక్షలు వసూలయ్యాయి. రెండో వారం (second week) నుంచి పెద్దగా కలెక్షన్లు ఉండవని నిర్మాతలు ముచ్చటించుకుంటున్నారు.
మొత్తానికి ఈ మూవీ వైజయంతి మూవీస్ కి (vyjayanthi movies) లాభం లేని రీ-రిలీజ్ గా మిగిలిపోయింది. జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రాన్ని ప్రింట్ వెర్షన్ నుంచి డిజిటల్‌కు (print version to digital) మార్పిడి చేసే ప్రక్రియను వైజయంతి మూవీస్ చేపట్టింది. ఆంధ్రాలోని పలు ప్రాంతాల్లో దీనావస్థలో ఉన్న ప్రింట్లను ముందుగా మరమత్తు చేసి దానిని 8K వెర్షన్‌లోకి మార్చారు. అనంతరం దానికి కలర్ గ్రేడింగ్, ఇతర టెక్నాలజీ హంగులు అద్ది 4K వెర్షన్‌లో 3డీ, 2డీ వెర్షన్లకు మార్చారు. దాదాపు ఈ ప్రాసెస్‌కు రూ.9 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్టు తెలిపారు. అయితే 3డీ వెర్షన్ క్వాలిటీ అంత గొప్పగా లేకపోయింది. కానీ 2డీ వెర్షన్ మాత్రం క్వాలిటీతో మంచి అనుభూతిని పంచింది.