ePaper
More
    HomeసినిమాUstaad bhagat singh | ఆప‌రేష‌న్ సిందూర్ బ్యాక్‌డ్రాప్‌తో ప‌వ‌న్ క‌ళ్యాణ్ చిత్రం.. ఇందులో సైనికుడిగా...

    Ustaad bhagat singh | ఆప‌రేష‌న్ సిందూర్ బ్యాక్‌డ్రాప్‌తో ప‌వ‌న్ క‌ళ్యాణ్ చిత్రం.. ఇందులో సైనికుడిగా క‌నిపించ‌నున్నాడా?

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Ustaad bhagat singh | ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ (Pawan Kalyan) సినిమాల స్పీడ్ పెంచాడు. రీసెంట్‌గా హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు చిత్ర షూటింగ్ (hari hara veeramallu shooting) పూర్తి చేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ (pawan kalyan) ఇప్పుడు ఓజీ చిత్రంతో (OG movie) బిజీగా ఉన్నాడు. ‘ఓజీ’ని కూడా ముగించే పనిలో ఉన్నాడు. ఆయన వెంట వెంటనే డేట్స్ కేటాయించి తన సినిమాలను పూర్తి చేయాలని చూస్తున్నాడు. అయితే, అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ను (ustaad bhagat sing) కూడా పవన్ ఇదే జోరులో ముగించాలని ప్లాన్ చేస్తున్నాడ‌ట‌. ఈ చిత్రానికి కూడా పవన్ భారీగా డేట్స్ కేటాయించినట్లు తెలుస్తోంది. ఇక దర్శకుడు హరీష్ శంకర్ (director harish shanker) కూడా ఈ సినిమాను పక్కా ప్లానింగ్‌తో ఎలాంటి ఆలస్యం కాకుండా ముగించాలని చూస్తున్నాడట.

    Ustaad bhagat singh | ఫ్యాన్స్‌కి ఫీస్ట్..

    ఈ చిత్ర షూటింగ్‌ను జూన్ 12 నుంచి నిర్విరామంగా జరిపేందుకు ప్లాన్స్ చేస్తున్న‌ట్టు టాక్. దీంతో ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు ఫుల్ స్పీడుతో జరుగుతున్నాయని తెలుస్తోంది. ఉస్తాద్ భగత్ సింగ్‌కు (ustaad bhagat sing) సంబంధించి మరో ఇంట్రస్టింగ్ న్యూస్ ఇప్పుడు ఫ్యాన్స్‌లో అంచనాలు పెంచేస్తోంది. ఈ సినిమా కోసం తన కెరీర్‌లోనే హయ్యస్ట్‌ రెమ్యూనరేషన్‌ అందుకోబోతున్నారట పవర్‌ స్టార్‌. ఈ సినిమాలో పవన్.. సైనికుడి పాత్రలో కనిపించనున్నాడని, ఆపరేషన్ సింధూర్ (operation sindoor) బ్యాక్‌డ్రాప్‌తో సినిమా ఉంటుందన్న టాక్ వినిపిస్తోంది. ఆపరేషన్ సిందూర్ (operation sindoor) నేపథ్యంలో ఒక సైనికుడి హీరోయిజం, దేశభక్తితో కూడిన కథని రాస్తున్నాడని టాక్.

    పవన్ కళ్యాణ్ (pawan kalyan) రియల్-లైఫ్ జనసేన ఇమేజ్‌ని, సైనికుడి పాత్రతో మిక్స్ చేసి, డైలాగ్స్‌లో రాజకీయ సెటైర్లు, మాస్ ఎలిమెంట్స్‌ని జోడిస్తున్నాడట. ఈ స్టోరీలో ఎమోషనల్ డెప్త్‌తో పాటు పవన్ స్టైలిష్ యాక్షన్ సీక్వెన్స్‌లు హైలైట్ అవుతాయని ఇన్‌సైడ్ టాక్. ఈ సినిమాతో పవన్ అభిమానులకు అదిరిపోయే ట్రీట్ ఇచ్చేందుకు హరీష్ శంకర్ (harish shankar) పక్కా ప్లానింగ్‌తో వెళ్తున్నాడట. ఈ సినిమాలో యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్‌గా (heroine srileela) నటించనుంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం (devisri prasad music) అందిస్తున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ (mythri movie makers) ప్రొడ్యూస్ చేస్తున్నారు.

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...