అక్షరటుడే, గాంధారి: MLA Madan Mohan Rao | శివనామస్మరణతో మనిషికి ప్రశాంతత లభిస్తుందని ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు(MLA Madan Mohan Rao) అన్నారు. గాంధారి మండల కేంద్రంలో నారాయణ గిరి వద్ద మార్కండేయుని ఆలయ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేకపూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. యువత ఆధ్యాత్మిక మార్గంలో నడవాలని సూచించారు. ఆలయంలో మాధవానంద సరస్వతి (Madhavananda Saraswati) చేతుల మీదుగా ప్రాణ ప్రతిష్ఠ, ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన కార్యక్రమాలు జరిగాయి. కార్యక్రమంలో భక్తులు, పద్మశాలి కులస్తులు, తదితరులు పాల్గొన్నారు.

ఆలయాన్ని సందర్శిస్తున్న మాదవానంద సరస్వతి