అక్షరటుడే, ఇందూరు: Teacher training | సమగ్ర శిక్ష సహిత విద్యా విభాగం ఆధ్వర్యంలో శిక్షణా తరగతులు కొనసాగుతున్నాయి. కరీక్యులర్ అండ్ థెరపీ స్ట్రాటజీస్ ఫర్ సీడబ్ల్యూఎస్ఎన్ అనే అంశంపై నిర్వహిస్తున్న స్పెషల్ క్లాసెస్ బుధవారం రెండో రోజుకు చేరుకున్నాయి. శిక్షణా కేంద్రాన్ని డీఈవో అశోక్ సందర్శించి పలు అంశాలను బోధించారు. అలాగే స్టేట్ రిసోర్స్ పర్సన్ డాక్టర్ బలరాం నాయక్, జిల్లా రిసోర్స్ పర్సన్స్ మురళి, మమతా, ప్రకాష్, రాజన్న ఆయా అంశాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో స్కూల్ అసిస్టెంట్లు, ఎస్జీటీ ప్రత్యేక ఉపాధ్యాయులు, ఐఈఆర్పీలు పాల్గొన్నారు.