ePaper
More
    HomeజాతీయంMicrosoft | 6800 మందిని ఇంటికి పంప‌బోతున్న మైక్రోసాఫ్ట్.. భారీగా ఉద్యోగాల కోత‌

    Microsoft | 6800 మందిని ఇంటికి పంప‌బోతున్న మైక్రోసాఫ్ట్.. భారీగా ఉద్యోగాల కోత‌

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Microsoft | సాఫ్ట్ వేర్ ఉద్యోగుల‌కి(Software Employees) ర‌క్ష‌ణ లేకుండా పోయింది. ఉద్యోగంకి గ్యారెంటీ లేని ప‌రిస్థితి. గ‌తంలో చాలా మంది ఉద్యోగుల జాబులు అర్ధాంత‌రంగా పోయాయి. ఇప్పుడు ప్రముఖ టెక్‌ దిగ్గజం మైక్రోసాఫ్ట్ Microsoft ఉద్యోగులకు employees షాక్‌ ఇచ్చింది. వేలాది మందిని తొలగించేందుకు సిద్ధమైంది. ప్రపంచవ్యాప్తంగా తమ సిబ్బందిలో మూడు శాతం మందిని తొలగిస్తున్నట్లు ఆ సంస్థ‌ ప్రకటించింది. సంస్థ నిర్ణయంతో దాదాపు 6 వేల మందిపై లేఆఫ్స్ layoff ప్రభావం పడనున్నట్లు తెలుస్తోంది. 2023లో 10 వేలమందికి ఉద్వాసన పలికిన అనంతరం ఇదే రెండో అతిపెద్ద తొలగింపు కానుంది.

    Microsoft | భ‌లే షాకిచ్చారుగా..

    వేగంగా మారుతున్న మార్కెట్‌లో విజయవంతంగా కొనసాగాలంటే మార్పులు చేయడం కంపెనీకి ముఖ్యమని మైక్రోసాఫ్ట్ ప్రతినిధి అన్నారు. గతేడాది జూన్‌ నాటికి ఆ సంస్థలో 2.28 లక్షల మంది సిబ్బంది ఉన్నారు. మైక్రోసాఫ్ట్‌ తాజా నిర్ణయంతో మధ్యస్థ స్థాయి మేనేజ్‌మెంట్‌ Management ఉద్యోగులపై అధిక ప్రభావం పడనుందని అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది ప్రారంభంలో కూడా పనితీరు ఆధారంగా పలువురు ఉద్యోగులను సంస్థ తొలగించిన విషయం తెలిసిందే. తాజా లేఆఫ్‌లకు ఉద్యోగుల పనితీరుకు సంబంధం లేదని సంస్థ స్పష్టం చేసింది.

    మైక్రోసాఫ్ట్‌(Microsoft)లో తొలగింపులు జరగడానికి కార‌ణం ఏంటంటే.. తొలగింపులు ఏ పోస్టులు లేదా ఏ విభాగాలపై ప్రభావం చూపుతాయో మైక్రోసాఫ్ట్ పేర్కొననప్పటికీ AI, క్లౌడ్ కంప్యూటింగ్ ఇంకా మారుతున్న కస్టమర్ డిమాండ్ల ప్రభావంతో వేగంగా మారుతున్న మార్కెట్‌లో చురుగ్గా ఇంకా పోటీతత్వంతో ఉండడానికి దీర్ఘకాలిక వ్యూహంలో భాగమని తెలిపింది. ఈ అంశంపై సంస్థ ప్రతినిధి ఒకరు సీఎన్‌బీసీ(CNBC)తో మాట్లాడుతూ.. మార్కెట్లో పైచేయి సాధించేలా ఉత్తమంగా ఉండేందుకు అవసరమైన సంస్థాగత మార్పులను అమలు చేస్తూనే ఉంటామని తెలిపారు. మేనేజ్‌మెంట్ స్థాయిల నుంచి తగ్గించడం, సంస్థ కార్యకలాపాలను క్రమబద్ధీకరించడమే ముఖ్య లక్ష్యమని పేర్కొన్నారు.

    More like this

    Cyber ​​Warriors | సైబర్ నేరాల నివారణకు అవగాహనే ఆయుధం

    అక్షరటుడే, కామారెడ్డి: Cyber ​​Warriors | సైబర్ నేరాల నివారణకు అవగాహనే ప్రధాన ఆయుధమని జిల్లా ఎస్పీ రాజేష్...

    Stock Market | లాభాల్లో ముగిసిన మార్కెట్లు.. 25 వేల మార్క్‌ను దాటిన నిఫ్టీ

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Stock Market | దేశీయ స్టాక్‌ మార్కెట్‌ గురువారం రేంజ్‌ బౌండ్‌లో కొనసాగింది. అయితే...

    Municipal Corporation | టౌన్ ప్లానింగ్ పనితీరుపై కలెక్టర్ సమీక్ష

    అక్షరటుడే, ఇందూరు : Municipal Corporation | నిజామాబాద్ నగరపాలక సంస్థ పట్టణ ప్రణాళిక విభాగం పనితీరుపై కలెక్టర్...