అక్షరటుడే, ఆర్మూర్: AIKMS | కొనుగోలు కేంద్రాల్లో పేరుకుపోయిన ధాన్యాన్ని తక్షణమే రైస్‌మిల్లులకు తరలించాలని ఏఐకేఎంఎస్(AIKMS) నాయకులు డిమాండ్ చేశారు. జక్రాన్‌పల్లి (Jakranpalli) మండలంలోని అర్గుల్ రైతు సహకారం సంఘం పరిధిలోని అర్గుల్, సికింద్రాబాద్, పుప్పాలపల్లి గ్రామాల్లో ధాన్యం కుప్పలను పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ అధికారుల నిర్లక్ష్యం కారణంగా కొనుగోలు కేంద్రాల్లో ధాన్యానికి మొలకలు వస్తున్నాయన్నారు. అధికారులకు విన్నవించినా పట్టించుకోవట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అదనపు కలెక్టర్ మాత్రమే స్పందించి ధాన్యాన్ని తరలించే ఏర్పాటు చేస్తామని చెప్పారు. కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన వారిలో ఏఐకేఎంఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి ప్రభాకర్, కార్యదర్శి దేవరాం, నిజామాబాద్ రూరల్, కామారెడ్డి సంయుక్త జిల్లా కమిటీ ప్రతినిధులు తదితరులున్నారు.
