ePaper
More
    HomeతెలంగాణHydraa Commissioner | హయత్​నగర్​ ఇన్​స్పెక్టర్​పై హైడ్రా కమిషనర్​ ఆగ్రహం

    Hydraa Commissioner | హయత్​నగర్​ ఇన్​స్పెక్టర్​పై హైడ్రా కమిషనర్​ ఆగ్రహం

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hydraa Commissioner | హయత్​నగర్​ ఇన్​స్పెక్టర్​పై హైడ్రా కమిషనర్ రంగనాథ్​(Hydraa Commissioner Ranganath) ఆగ్రహం వ్యక్తం చేశారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండలం కొహెడలో రాజాజీ నగర్​ పేరిట వేసిన లేఅవుట్​ను బుధవారం ఆయన పరిశీలించారు. దాదాపు 17 ఎకరాల విస్తీర్ణంలో 190 వరకు ప్లాట్లతో ఉన్న లేఅవుట్​లోని పార్కులు, రోడ్లను కలిపేసి సమ్మిరెడ్డిబాల్ రెడ్డి అనే వ్యక్తి తప్పుడు ధ్రువపత్రాలతో తమ ప్లాట్లను కబ్జా చేశారంటూ పలువురు బాధితులు గతంలో ప్రజావాణి(Prajavani)లో ఫిర్యాదు చేశారు. దీంతో హైడ్రా ఆక్రమణలను, రోడ్లకు అడ్డంగా నిర్మించిన కట్టడాలను తొలగించింది.

    సమ్మిరెడ్డి బాల్​రెడ్డి మళ్లీ అక్కడ నిర్మాణాలు చేపట్టగా ప్లాట్ యజమానులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో సమ్మిరెడ్డి వాళ్లపై దాడి చేశాడు. ఈ మేరకు బాధితులు మళ్లీ హైడ్రా(Hydraa)ను ఆశ్రయించారు. దీంతో కమిషనర్​ రంగనాథ్​ లేఅవుట్​ను పరిశీలించారు. సమ్మిరెడ్డి బాల్ రెడ్డి దాడి చేయగా నెత్తిపై తనకు 12 కుట్లు పడ్డాయని ఓ బాధితుడు కమిషనర్​కు చెప్పాడు. దీంతో దాడి చేసిన వారిపై ఎందుకు హత్యాయత్నం కేసు పెట్టలేదని ఇన్​స్పెక్టర్(Inspector)​ను కమిషనర్​ నిలదీశారు. లే అవుట్​లోని పార్క్​లు, రోడ్లను కబ్జా నుంచి విడిపిస్తామని బాధితులకు ఆయన హామీ ఇచ్చారు. ఆక్రమణలకు పాల్పడిన వారిపై క్రిమినల్​ చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం కొహెడలోని కొత్త చెరువును సందర్శించారు.

    Latest articles

    Pavan Kalyan | కూటమి ఐక్యత దెబ్బతీసే ప్రయత్నాలు.. డిప్యూటీ సీఎం పవన్​ కల్యాణ్​ కీలక వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Pavan Kalyan | ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)​ డిప్యూటీ సీఎం పవన్​ కల్యాణ్​ (Pavan...

    Meenakshi natarajan | బీసీల తలరాత మార్చనున్న 42 శాతం రిజర్వేషన్లు : మీనాక్షి నటరాజన్

    అక్షరటుడే, ఆర్మూర్: బీసీల తలరాతను 42 శాతం రిజర్వేషన్లు మార్చనున్నాయని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్​ఛార్జి మీనాక్షి నటరాజన్...

    Hyderabad | ప్రియురాలితో బిజీగా ఉన్న భర్త.. భార్య ఎంట్రీతో షాక్​.. తర్వాత ఏమైందంటే?

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hyderabad | సమాజంలో వివాహేతర సంబంధాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. కట్టుకున్న వారిని కాదని పలువురు...

    Minister Ponguleti | కార్పొరేట్ స్థాయిలో సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాలు : మంత్రి పొంగులేటి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Minister Ponguleti | సబ్​ రిజిస్ట్రార్​ కార్యాలయాల్లో (At the Sub-Registrar's offices) సకల...

    More like this