Rohith-Sharma
Rohit Sharma | బీజేపీలోకి రోహిత్ శర్మ..?

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Rohit Sharma | టెస్ట్ క్రికెట్‌(Test Cricket)కు వీడ్కోలు పలికిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ.. రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్నాడా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. తాజాగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌‌(Maharashtra Chief Minister Devendra Fadnavis)ను రోహిత్ శర్మ కలవడం చర్చనీయాంశమైంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.

క్రికెట్‌కు వీడ్కోలు పలికిన చాలా మంది క్రికెటర్లు తమ రెండో ఇన్నింగ్స్‌గా పొలిటికల్ కెరీర్‌(Political Career)ను ఎంచుకున్నారు. ఇందులో కొందరు సక్సెస్ కాగా.. మరికొందరు మధ్యలోనే తప్పుకున్నారు. మహ్మద్ అజారుద్దీన్, నవజ్యోత్ సింగ్ సిద్దూ, యూసుఫ్ పఠాన్, గౌతమ్ గంభీర్, అంబటి రాయుడు, కేదార్ జాదవ్‌‌లు పొలిటికల్ జర్నీ ప్రారంభించారు.

ఈ క్రమంలోనే రోహిత్ శర్మ(Rohit Sharma) కూడా రాజకీయాల్లోకి వస్తున్నాడనే ఊహాగానాలు తెరపైకి వచ్చాయి. అయితే ఇందులో నిజం లేదనే విషయం స్పష్టంగా అర్థమవుతోంది. దేవేంద్ర ఫడ్నవీస్ కోరిక మేరకే రోహిత్ శర్మ ఆయనను కలిసినట్లు తెలుస్తోంది. రోహిత్ శర్మ‌ను తన నివాసంలో కలుసుకున్నట్లు ఫడ్నవిస్ ట్వీట్ చేశాడు.

‘భారత క్రికెటర్ రోహిత్ శర్మను నా నివాసంలోకి స్వాగతించడం, కలవడం, మాట్లాడటం చాలా సంతోషంగా అనిపించింది. టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ అయిన రోహిత్ శర్మకు భవిష్యత్తులో మరింత విజయం సాధించాలని శుభాకాంక్షలు తెలియజేశాను’ అని ఫడ్నవీస్​ పేర్కొన్నారు. భవిష్యత్తులో ఏమో కానీ.. ప్రస్తుతానికైతే రోహిత్ శర్మ రాజకీయాల్లో చేరే అవకాశం లేదు. 2027 వన్డే ప్రపంచకప్ ఆడటమే తన లక్ష్యమని విరాట్ కోహ్లీ(Virat Kohli) స్పష్టం చేశాడు.

రోహిత్ శర్మ టీమిండియా తరఫున 67 టెస్ట్ మ్యాచ్‌లు ఆడి.. 4301 పరుగులు చేశాడు. అందులో రోహిత్ శర్మ 12 సెంచరీలు, 18 అర్ధ సెంచరీలు, ఒక డబుల్ సెంచరీ బాదాడు.