అక్షరటుడే, వెబ్‌డెస్క్:Former MLA Jeevan Reddy | బీఆర్ఎస్(BRS) నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి(Former MLA from Armur Jeevan Reddy)కి సుప్రీం కోర్టులో ఊరట లభించింది. తన భూమిని ఆక్రమించి బెదిరించారంటూ జీవన్‌రెడ్డిపై సామ దామోదర్‌రెడ్డి అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. 2016లో తన భూమిని తీసుకుని అభివృద్ధి చేస్తానంటూ ఒప్పందం కుదుర్చుకున్న జీవన్‌రెడ్డి.. అభివృద్ధి చేయలేదని, డబ్బులు కూడా ఇవ్వలేదని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేగాకుండా తన భూమిలోకి వెళ్లనివ్వడం లేదన్నారు. దీంతో జీవన్‌రెడ్డిపై చేవెళ్ల పోలీసులు(Police) కేసు నమోదు చేశారు. ఈ కేసులో తనతో పాటు, కుటుంబ సభ్యులను అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ ఇవ్వాలని సుప్రీంకోర్టు(Supreme Court)ను ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను బుధవారం విచారించిన దేశ అత్యున్నత న్యాయస్థానం ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. కేసులో పోలీసులకు సహకరించాలని ఆదేశించింది.
Former MLA Jeevan Reddy | సుప్రీంలో మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డికి ఊరట
Published on
