Accident
Armoor | రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి

అక్షరటుడే, వెబ్​డెస్క్:Armoor | రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. ఈ ఘటన ఆర్మూర్​ మండలం చేపూర్​ శివారులో జాతీయ రహదారి 63పై బుధవారం ఉదయం 11 గంటలకు చోటు చేసుకుంది. ఆర్మూర్​కు చెందిన అర్జున్, నరేందర్​ బైక్​పై మెట్​పల్లి వైపు నుంచి ఆర్మూర్​ వస్తుండగా.. చేపూర్​ శివారులో కరీంనగర్​ వైపు వెళ్తున్న డీసీఎం(DCM) ఢీకొంది. ఈ ప్రమాదంలో అర్జున్​ అక్కడికక్కడే మృతి చెందగా.. నరేందర్​ ఆర్మూర్​ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. ఈ ఘటనలో హైవేపై ట్రాఫిక్​ జామ్​ కాగా.. పోలీసులు(Police) అక్కడకు చేరుకొని క్లియర్​ చేశారు.