Mohammaed-Shami
Mohammed Shami | మా భ‌విష్య‌త్ నాశ‌నం చేస్తున్నారు.. రిటైర్మెంట్ వార్త‌ల‌పై మ‌హ్మ‌ద్ ష‌మీ ఆగ్ర‌హం

అక్షరటుడే, వెబ్​డెస్క్ :Mohammed Shami | టీమిండియా ఆట‌గాళ్లు రోహిత్ శ‌ర్మ‌, విరాట్ కోహ్లీ Virat Kohli ఇటీవ‌ల టెస్ట్ క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్ర‌క‌టించ‌డం మ‌నం చూశాం. భారత క్రికెట్ జట్టు త్వరలో ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్ల‌నున్న నేప‌థ్యంలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టెస్టులకు వీడ్కోలు ప‌ల‌క‌డం అంద‌రికి పెద్ద షాకిచ్చింది. అయితే ఇద్దరు సీనియ‌ర్స్ క్రికెటర్లు టెస్టు ఫార్మాట్‌కు రిటైర్మెంట్(Retirement) ప్రకటించడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. జూన్ 20న 5 టెస్టు మ్యాచ్‌ల సిరీస్ ప్రారంభం కానుంది. అయితే ఇప్పుడు ఫాస్ట్‌ బౌలర్‌ మహ్మద్‌ షమీ సైతం రిటైర్మెంట్‌ ప్రకటించబోతున్నట్లుగా పలు వైబ్‌సైట్స్‌ వార్త కథనాలను ప్రచురించాయి. ఆ వార్తలపై మహ్మద్‌ షమీ(Mohammed Shami) తీవ్రంగా స్పందించాడు. తమ భవిష్యత్‌ను నాశనం చేస్తున్నారంటూ మండిపడ్డాడు.

Mohammed Shami | ష‌మీ ఫైర్..

రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ తర్వాత ఇప్పుడు మహ్మద్ షమీ కూడా టెస్ట్ క్రికెట్ నుండి రిటైర్మెంట్ Retirement తీసుకోబోతున్నాడని ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ గురించి ఒక వెబ్‌సైట్ కథనం రాసింది. సోషల్ మీడియాలోనూ షమీ రిటైర్మెంట్ అంశం తెరమీదకు వచ్చింది. ఆ విషయంపై షమీ స్పందిస్తూ.. అవన్నీ కట్టుకథలేనని, తాను రిటైర్మెంట్ పై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశాడు. రిటైర్మెంట్ గురించి కనీసం ఆలోచించలేదని.. సోషల్ మీడియా(Social Media)లో తన కోపాన్ని వెళ్లగక్కాడు. తప్పుడు రాతలు రాసి కెరీర్ నాశనం చేయొద్దు అన్నాడు. ముందు నీ ఉద్యోగానికి వీడ్కోలు పలకడానికి రోజులు లెక్కపెట్టుకో.. తర్వాత నా రిటైర్మెంట్ గురించి మాట్లాడవచ్చు. నీలాంటి వాళ్లు మీడియాను సర్వనాశనం చేశారు. ఆటగాళ్ల భవితవ్యం గురించి ఒక్కసారైనా మంచిగా చెప్పండి. ఈ రోజుకు ఇది చాలా చెత్త వార్త సారీ అంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

ఛాంపియన్ ట్రోఫీ(Champions Trophy)కి ముందు గాయం నుంచి కోలుకుని టీమిండియాలోకి రీ ఎంట్రీ ఇచ్చిన షమీ ఐపీఎల్‌లో అంత ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌ర‌చ‌లేక‌పోయాడు. ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్‌కి ష‌మీని Shami ఎంపిక చేయ‌ర‌నే ప్ర‌చారం న‌డిచింది. ఇంగ్లండ్ పర్యటనకు అతన్ని ఎంపిక చేయవద్దంటూ కూడా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అయితే 2023లో భారత్‌లో జరిగిన వన్డే ప్రపంచ కప్‌లో షమీ టీమిండియాను ఒంటిచేత్తో ఫైనల్‌కు చేర్చాడు. ఆ మెగా టోర్నీ(Tournament)లో షమీ ఏడు మ్యాచ్‌ల్లో ఏకంగా 24 వికెట్లు తీసి లీడింగ్ వికెట్ టేకర్‌గా నిలిచాడు. తన కెరీర్‌లో 64 టెస్టులు, 108 వన్డేలు, 25 టీ20లు ఆడిన షమీ 462 వికెట్లు తీశాడు.