ePaper
More
    Homeబిజినెస్​Today gold price | స్వ‌ల్పంగా పెరిగిన ప‌సిడి ధ‌ర‌.. ఎక్క‌డెక్క‌డ ఎంత రేటుందంటే..!

    Today gold price | స్వ‌ల్పంగా పెరిగిన ప‌సిడి ధ‌ర‌.. ఎక్క‌డెక్క‌డ ఎంత రేటుందంటే..!

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Today gold price | అంతర్జాతీయ వాణిజ్య యుద్ధ పరిస్థితులు సద్దుమణగడం, అమెరికా- చైనా మధ్య ఒప్పందం(US – China trade deal) కుదరడంతో బంగారం ధరలు ఒక్కసారిగా దిగివ‌చ్చిన‌ట్టే వ‌చ్చి క్ర‌మంగా పెరిగాయి. ఈ రోజు బంగారం ధ‌ర(Gold price) స్వ‌ల్పంగా పెరిగింది. గత రెండు రోజులుగా దిగి వచ్చిన పసిడి ధర ఈ రోజు కొంత మేర పెరిగింది. అయితే ఇప్పుడిప్పుడే యుద్ధ భయాలు తగ్గడంతో అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర తగ్గుతుందని భావిస్తున్న పసిడి ప్రియులకు ఇది షాకే అని చెప్పాలి. అయితే బంగారం బాటలో పయనిస్తున్న వెండి ధరలు ఈ రోజు మాత్రం స్థిరంగా కొనసాగుతున్నాయి. నేపథ్యంలో మే 14 తేదీ బుధవారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణాలోని ప్రధాన నగరాల్లో సహా దేశంలోని ప్రధాన నగరాల్లో ఈ రోజు బంగారం, వెండి ధరలు(Silver price) ఎలా ఉన్నాయో చూస్తే..

    Today gold price | కాస్త పెరిగిన ధ‌ర‌..

    హైదరాబాద్(Hyderabad)లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర(22 carat gold price) రూ. 88,560 ఉంది. మంగళవారంతో పోల్చితే రూ.10 పెరిగింది. మరోవైపు ప్యూర్ గోల్డ్​ అంటే 24 క్యారెట్ల 10 గ్రాముల ధర(22 carat gold price) కూడా పది రూపాయలు పెరిగి రూ.96,610 లు గా కొనసాగుతోంది. రాజమండ్రి, విజయవాడ, విశాఖపట్టణం, పొద్దుటూరు, వరంగల్ నగరాల్లో కూడా కొనసాగుతున్నాయి. ఢిల్లీలో బంగారం ధర 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ. 88710 ఉంది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ. 96760ఉంది. చెన్నై లో ఈ రోజు 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ 88,560ఉంది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.96,610లుగా కొనసాగుతోంది. దేశ రాజధాని ముంబైలో ఈ రోజు బంగారం ధర(gold price in mumbai) 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.88,560 లు ఉండగా 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ. 96,610 లుగా కొనసాగుతోంది.

    కోల్‌కతాలో ఈ రోజు బంగారం ధర 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.88,560 ఉంది, ప్యూర్ గోల్డ్ (24 క్యారెట్ల బంగారం) 10 గ్రాములకు రూ. 96,610ఉంది. బెంగళూరులో ఈ రోజు బంగారం ధర 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.88,560 ఉంది, ప్యూర్ గోల్డ్ (24 క్యారెట్ల బంగారం) 10 గ్రాములకు రూ. 96,610గా కొనసాగుతోంది. కేరళలో ఈ రోజు బంగారం ధర 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.88,560 ఉంది, ప్యూర్ గోల్డ్ (24 క్యారెట్ల బంగారం) 10 గ్రాములకు రూ. 96,610ఉంది. బంగారం తర్వాత అత్యధికంగా కొనుగోలు చేసే లోహం వెండి. పండుగలు, శుభకార్యాలు ఏ సందర్భంలోనైనా సరే వెండి వస్తువుల కొనుగోలుకు ఆసక్తిని ఎక్కువ చూపిస్తున్నారు. ఈ రోజు వెండి ధరలో ఎటువంటి మార్పులు చోటు చేసుకోలేదు. స్థిరంగా కొనగాతోంది. దీంతో ఈ రోజు కిలోవెండి రూ. 1,08,900లుగా కొనసాగుతోంది.

    More like this

    CMRF Checks | బాధితులకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

    అక్షరటుడే, ఆర్మూర్ : CMRF Checks | ఆలూర్ మండలం రాంచంద్రపల్లి గ్రామానికి(Ramchandrapalli Village) చెందిన అనారోగ్యంతో బాధపడుతున్న...

    Maoists | మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సెక్రెటరీగా తిరుపతి నియామకం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Maoists | మావోయిస్టులు కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీ కేంద్ర కమిటీ సెక్రెటరీగా జగిత్యాల...

    Super Six | “సూపర్ సిక్స్ – సూపర్ హిట్” బహిరంగ సభకు ఏర్పాట్లు పూర్తి .. ఎవ‌రెవ‌రు హాజ‌రు కానున్నారంటే..!

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Super Six | కూటమి ప్రభుత్వం ఏర్పాటు అనంతరం తొలిసారిగా అధికార పక్షం ఆధ్వర్యంలో...