అక్షరటుడే ఆర్మూర్: Gaddam Rajareddy | అంకాపూర్ మాజీ గ్రామ సర్పంచ్, దివంగత రాష్ట్ర ఉత్తమ ఆదర్శ రైతు అవార్డు గ్రహీత గడ్డం రాజారెడ్డి విగ్రహాన్ని మంగళవారం ఆవిష్కరించారు. ఆర్మూర్, అర్బన్ ఎమ్మెల్యేలు పైడి రాకేష్ రెడ్డి, ధన్పాల్ సూర్యనారాయణ (MLA Dhanpal Suryanarayana) (MLA Rakesh reddy)ఆయన విగ్రహావిష్కరణలో ప్రసంగించారు. కార్యక్రమంలో జాతీయ పసుపు బోర్డు ఛైర్మన్ పల్లె గంగారెడ్డి (National Turmeric Board Chairman Palle Gangareddy), బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షుడు పెద్దోళ్ల గంగారెడ్డి, సుచరిత రెడ్డి, మిట్టపల్లి గంగారెడ్డి , గ్రామస్థులు పాల్గొన్నారు.
